బాహుబలి, బాహుబలి2( Baahubali, Baahubali 2 ) సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కినా కంటెంట్ అద్భుతంగా ఉండటం వల్ల బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.అయితే ఈ ఫార్ములా అన్ని సినిమాలకు వర్కౌట్ కాదు.
ఆదిపురుష్ ( Adipurush )సినిమాను కూడా రెండు భాగాలుగా తెరకెక్కించాలని మేకర్స్, ఓం రౌత్ భావించారట.అయితే ప్రభాస్ మాత్రం ఈ నిర్ణయం కరెక్ట్ కాదని ఒక భాగంగానే తెరకెక్కించాలని తాను కాల్షీట్స్ కేటాయించలేనని తేల్చి చెప్పారట.
ఆదిపురుష్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కి ఉంటే మాత్రం సెకండ్ పార్ట్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కించినా నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు మిగిలేవి.ప్రభాస్ నిర్ణయం నిర్మాతలకు చాలా మేలు చేసిందని చెప్పవచ్చు.
ఆదిపురుష్ సినిమా వీక్ డేస్ లో భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించలేక ఢీలా పడుతుండటం గమనార్హం.థియేటర్లలో మరో సినిమా నుంచి పోటీ లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చిందని చెప్పవచ్చు.

ఆదిపురుష్ మేకర్స్ కు ప్రభాస్( Prabhas ) తీసుకున్న నిర్ణయం వల్ల రిలీజ్ కు ముందే కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది.ఆదిపురుష్ మూవీ మరీ భారీ స్థాయిలో నష్టాలను అయితే మిగల్చడం లేదు.మరో 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే మాత్రం ఈ సినిమా సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ కు గత కొంతకాలంగా లక్ కలిసిరావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా ప్రభాస్ సినిమాల ఫలితాలతో లేకుండా ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి.ప్రభాస్ సినిమాలకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తుండటం గమనార్హం.
ప్రభాస్ తన క్రేజ్ ను మరింత పెంచుకోవడంతో పాటు సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.







