ఆ బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ... లిస్ట్‌లో మన బ్యాంక్‌ కూడా ఉందండోయ్!

ఆర్‌బీఐ (బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నేపథ్యంలో 3 బ్యాంకులకు భారీ జరిమానా విధించి షాక్ ఇచ్చింది.

 Rbi Imposed Huge Penalty On These Three Banks Details, Rbi, Key Decision, Latest-TeluguStop.com

నిబంధనలను అతిక్రమించిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఏ ఏ బ్యాంకులకు ఝలక్ ఇచ్చిందో, ఎంత మొత్తాన్ని పెనాల్టీగా విధించిందో ఒకసారి చూస్తే, వీటిల్లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, డోంబివ్లీ నగరి సహకారి బ్యాంక్ అనేవి ఉన్నాయి.

ఈ బ్యాంకులు రూల్స్ బ్రేక్ చేయడం వల్ల భారీ మొత్తంలో జరిమానా ఎదుర్కోవాల్సి వచ్చింది.

Telugu Andhrapradesh, Dombivlinagari, Key, Latest, Rbi Penalty, Banks, Urbanoper

ఈ క్రమంలో డోంబివ్లీ నగరి సహకారి బ్యాంక్‌కు( Dombivli Nagari Sahakari Bank ) రూ.50 లక్షల జరిమానా విధించగా ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కు( Andhra Pradesh Mahesh Co-operative Urban Bank ) రూ.65 లక్షల పెనాల్టీ, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్‌కు( Urban Co-operative Bank ) రూ.6 లక్షల జరిమానా విధించింది.ఆంధ్ర ప్రదేశ్ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్, డోంబివ్లీ నగరి సహకారి బ్యాంకులు రెండూ కొన్నింటిని సరిగ్గా అమలు చేయడంలో విఫలం కావడంతో సైబర్ సెక్యూరిటీ సమస్యలు అనేవి తలెత్తాయి.

అందుకే ఆర్‌బీఐ ఈ బ్యాంకులపై పెద్ద మొత్తంలోనే జరిమానా విధించినట్టు తెలుస్తోంది.మరోవైపున అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ విషయానికి వస్తే.కస్టమర్ల నుంచి అవసరమైన డాక్యుమెంట్లను తీసుకోవడంలో బ్యాంక్ విఫలం కావడంతో ఆర్‌బీఐ ఈ బ్యాంక్‌కు జరిమానా వేసింది.

Telugu Andhrapradesh, Dombivlinagari, Key, Latest, Rbi Penalty, Banks, Urbanoper

అంతేకాకుండా కస్టమర్ ఐడెంటిఫికేషన్‌కు సంబంధించి బ్యాంక్ తగిన రూల్స్‌ను పాటించకపోవడం వంటి కారణాలను కూడా ఆర్‌బీఐ( RBI ) తెలిపింది.కస్టమర్ లోకల్ అడ్రస్ ధ్రువీకరించుకోకుండానే అకౌంట్‌లో ట్రాన్సాక్షన్లు నిర్వహించడం, చెక్ బుక్స్‌కు సంబంధించిన నిబంధనలను బ్యాంక్ సరిగా అనుసరించకపోవడం వంటి కారణాలను పరిగణనలోకి తీసుకుంది ఆర్‌బీఐ.ఆర్‌బీఐ ఈ మూడు బ్యాంకులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి, ఎందుకు పెనాల్టీ విధించకూడదో వివరణ ఇవ్వాలని ఆర్‌బీఐ కోరింది.

బ్యాంకుల నుంచి స్పందన వచ్చిన తర్వాత ఆర్‌బీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube