సలార్ తప్ప మరొకటి వద్దు అనుకున్న.. కానీ ఓజి ఒప్పుకునేలా చేసింది..

టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్( Director Sujeeth ) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే పెరిగి పోయాయి.

 Sriya Reddy Comments On Pawan Kalyan Og Details, Sriya Reddy, Director Sujeeth,-TeluguStop.com

వరుస అప్డేట్ లను అందిస్తూ మరింత హోప్స్ పెంచుకుంటున్న ఈ సినిమా నుండి ఇటీవలే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చిన వచ్చిన విషయం విదితమే.రీసెంట్ గానే మూడవ షెడ్యూల్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ లేడీ నటిస్తున్నట్టు అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేశారు.

వెర్సటైల్ నటి శ్రీయా రెడ్డి ఈ సినిమాలో భాగం అయినట్టు తెలిపారు.విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమాలో నెగిటివ్ రోల్ లో మెప్పించిన బ్యూటీ శ్రీయ రెడ్డి లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

అయితే ఈ భామ ఓజి( OG Movie ) కంటే ముందుగానే సలార్ సినిమాలో( Salaar ) నటిస్తున్నట్టు ప్రకటన వచ్చింది.కాగా ఇప్పుడు పవన్ ఓజిలో కూడా భాగం అయ్యింది.

Telugu Salaar, Sujeeth, Og, Pawan Kalyan, Prabhas, Priyanka Mohan, Sriya Reddy,

ఈ క్రమంలోనే ఈమె ఈ సినిమా షూట్ స్టార్ట్ అయిన మొదట్లోనే ఓజి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విషయం విదితమే.మరి తాజాగా ఈమె మరోసారి ఈ సినిమాపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా కథ మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ అని సుజిత్ అద్భుతమైన కథ తన రోల్ ను డిజైన్ చేసాడని.ఈ కథ విన్న 5 నిముషాల్లోనే నేను ఓకే చెప్పానని చెప్పుకొచ్చింది.

Telugu Salaar, Sujeeth, Og, Pawan Kalyan, Prabhas, Priyanka Mohan, Sriya Reddy,

మరి తాజాగా ఈ బ్యూటీ మరోసారి ఈ సినిమా కోసం మాట్లాడుతూ.ప్రస్తుతం సలార్ తప్ప మరో సినిమా ఏది కమిట్ అవ్వకూడదు అని అనుకున్న అని కానీ ఓజి కంటెంట్ ఒప్పుకునేలా చేసిందని శ్రీయ చెప్పుకొచ్చింది.దీనిని బట్టి ఈ కథ ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతుందో అర్ధం అవుతుంది.

కాగా మాసివ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube