కేంద్ర పధకం: మీ కుమార్తె చదువుకి సర్కారే డబ్బులిస్తుంది తెలుసా?

‘బేటీ బచావో-బేటీ పఢావో’( Beti Bachao Beti Padhao ) కార్యక్రమాన్ని మోదీ ప్రభుత్వం చాలా కాలంగా ప్రచారం చేస్తోన్న విషయం అందరికీ తెలిసిందే.ఆడపిల్లలకు రక్షణ, మంచి చదువు కొనసాగించేలా చూడడం ఈ పథకం ఉద్దేశం.మోదీ గవర్నమెంట్ రాకముందే దేశంలో ఇలాంటి పథకం ఒకటి అమల్లో ఉంది.1997లో, అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘బాలిక సమృద్ధి యోజన’ పధకాన్ని ప్రారంభించడం విశేషం.ఈ పథకం ద్వారా… ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఆమె 10వ తరగతి చదువు పూర్తయ్యే వరకు, చదువు ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బుని అందజేస్తుంది.

 Govt Scheme Balika Samridhi Yojana Is Providing Financial Aid To Daughters Till-TeluguStop.com

ఆడపిల్ల పుట్టగానే తల్లికి రూ.500 ఆర్థిక సాయం అందిస్తారు.ఆ తర్వాత 10వ తరగతి వరకు, ప్రతి దశలో కొంత మొత్తం అందుతూ ఉంటుంది.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివశించే పేద కుటుంబాలు మాత్రమే ఈ పధకానికి అర్హులు.ఒక కుటుంబంలో ఇద్దరు కుమార్తెలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. బాలిక సమృద్ధి యోజన( Balika Samridhi Yojana ) కింద మీ కుమార్తె పేరును చేర్చడానికి ముందుగా మీరు కొన్ని రకాల ఫ్రూఫ్లు సబ్మిట్ చేయవలసి ఉంటుంది.ఆడపిల్ల జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల నివాస ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రులు లేదా బంధువు గుర్తింపు రుజువు ఇవ్వాలి.

ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ వంటివి ఇవ్వాలి.బాలిక సమృద్ధి యోజన కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Telugu Balikasamridhi, Betibachao, Central Schemes, Central Scheme, Credit, Daug

ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి, అంగన్వాడీ కార్యకర్త వద్ద లేదా, ఆరోగ్య సేవ కేంద్రాలకు వెళ్లి సంబంధిత ఫారం తీసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు.ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి, ఫారాన్ని పూరించిన తర్వాత ఆన్లైన్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయాలి.గ్రామీణ పట్టణ ప్రాంత లబ్ధిదారులకు ఈ ఫారం భిన్నంగా ఉంటుంది.ఫారాన్ని ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారో, మళ్లీ అదే ప్లాట్ఫామ్లో సబ్మిట్ చేయాలి.ఫారంలో అడిగిన సమాచారాన్ని మిస్ చేయకుండా ఇవ్వాలి.

Telugu Balikasamridhi, Betibachao, Central Schemes, Central Scheme, Credit, Daug

ఎంత స్కాలర్షిప్ ఇస్తారంటే… 1 నుంచి 3వ తరగతి వరకు ప్రతి తరగతికి సంవత్సరానికి రూ.300, 4వ తరగతిలో రూ.500, 5వ తరగతిలో రూ.600, 6 నుంచి 7వ తరగతి వరకు రూ.700, 8వ తరగతిలో రూ.800, 9 నుంచి 10వ తరగతి వరకు రూ.1000 సాయం అందిస్తారు.బాలిక సమృద్ధి యోజనను గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ద్వారా నిర్వహిస్తారు.పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ అధికారులు ఈ పథకాన్ని అమలు చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube