ఏపీలో విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.ఎండల వేడి కారణంగా మరో వారం రోజులపాటు రాష్ట్రంలో ఒంటిపూట బడులు కొనసాగిస్తామని తెలిపారు.
అన్ని ఉపాధ్యాయ సంఘాల సలహాలు తీసుకొని బదిలీలు చేశామని మంత్రి బొత్స పేర్కొన్నారు.ఇప్పటివరకు 52,240 మందికి బదిలీలతో పాటు 679 సెకండ్ ఎంఈవో పోస్టులు మంజూరు చేశామని చెప్పారు.355 ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న మంత్రి బొత్స అన్ని స్కూళ్లలో కంప్యూటర్ ఆపరేటర్లను నియమిస్తున్నామని తెలిపారు.విద్యాకానుక కిట్స్ లో క్వాలిటీ లేకుంటే పంపిణీ చేసిన కంపెనీని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు.







