ప్రజల వద్దకే పోలీస్ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు వినూత్నంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లి లో ప్రజల వద్దకే పోలీసులు అనే కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ మొగిలి మాట్లాడుతూ గ్రామంలో వారికున్న సమస్యలను పరిష్కరించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ కు రాని వయో వృద్ధుల కోసం,వివిధ కారణాల వల్ల పోలీస్ స్టేషన్ కు రాని వారి సమస్యలని పరిష్కరించుకోడం కోసం నేరుగా పోలీసులు మీ గ్రామాల్లోకి వచ్చి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది అని సీఐ మొగిలి అన్నారు.

 Police Program At The People, Police ,people, Friendly Policing, Sp Akhil Mahaja-TeluguStop.com

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు నెలకు రెండు తేదీలలో 15,30 వ తేదీలలో ఈ కార్యక్రమం ఎల్లారెడ్డి పేట సర్కిల్ వ్యాప్తంగా నిర్వహిస్తామని అన్నారు.

కార్యక్రమం ప్రారంభించే వారం రోజులు ముందు గ్రామములో డప్పు చాటింపు,ఆ గ్రామ సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ప్రచారం నిర్వహిస్తామని సీఐ అన్నారు.

ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు జరుగుతుందని అన్నారు.ఇట్టి కార్యక్రమం ఆయా గ్రామపంచాయతీ ల వద్ద నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

శనివారం ప్రజల వద్దకే పోలీసులు కార్యక్రమంలో భాగంగా బండలింగంపల్లి లో ఆస్తి వివాదాలు,చదువుకున్న సర్టిఫికెట్లు,ఇతర సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారు , పాత కేసులలో న్యాయం జరుగలేదని,డబల్ బెడ్ రూం ఇండ్లు తమకు రాలేదని పిర్యాదులు అందినట్లు సీఐ మొగిలి తెలిపారు.ఇట్టి కార్యక్రమం ను ప్రజలందరు మీమీ గ్రామాల్లో జరిగినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్తపల్లి వాణి,ఎంపీటీసీ కొత్తపల్లి పద్మ,ఎస్.ఐ ప్రేమ్ దీప్ తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube