సీతాఫలం తెగులు( Cantaloupe pest ) అనేవి ఒక వైరస్ ద్వారా మినుము విత్తనాలను ఆశించి వ్యాపిస్తుంది.ఆ తర్వాత మినుము మొక్కలలో ఈ తెగుల వ్యాప్తి పెరుగుతూ పోతుంది.
ఆ తర్వాత రసం పీల్చే పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి మరొక మొక్కకు ఈ తెగులు వ్యాప్తి చెందుతాయి.ఈ తెగుల వల్ల 80 శాతానికి పైగా దిగుబడి తగ్గి తీవ్ర నష్టం వచ్చే అవకాశం ఉంటుంది.

మినుము మొక్క ఆకులు( Vigna mungo ) ముడతలు ఏర్పడి ముడుచుకుపోయి తోలువలే అయిందంటే దానికి సీతాఫలం తెగులు సోకినట్లు నిర్ధారించుకోవాలి.ఈ తెగులు సోకిన మొక్కలు ఎదుగుదల అనేది ఉండదు.మినుము గింజలు పూర్తిగా దెబ్బతింటాయి.మొక్క కాండం ఎరుపు రంగులోకి మారుతుంది.చిన్నచిన్న మొగ్గలలో ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది.ఈ లక్షణాలు అన్ని పంట విచ్చుకున్న నెల రోజులకు గమనించవచ్చు.
అయితే ఈ తెగుల నుండి పంటను సంరక్షించాలంటే ముందుగా నాణ్యమైన విత్తనాలను తీసుకొని విత్తన శుద్ధి( Seed treatment ) చేసుకున్న తర్వాతనే పంట పొలంలో విత్తు కోవాలి.ఎందుకంటే ఈ తెగులు ముఖ్యంగా విత్తనాల ద్వారానే సోకుతుంది.
తరువాత తెగులు సోకిన మొక్కలను పంట పొలంలో గుర్తించి పంట నుండి వేరుచేసి దూరంగా పూడ్చివేయాలి.మినుము పంట పొలం చుట్టూ మొక్కజొన్న, జొన్న, సజ్జలు( Maize, sorghum, sorghum ) వంటి మొక్కలు వేయడం వల్ల ఈ తెగుల వ్యాప్తిని కాస్త నిరోధించవచ్చు.

పంట కోత తరువాత మినుము పంట అవశేషాలని పంట నుండి పూర్తిగా తొలగించి కాల్చి నాశనం చేయాలి.ఇలా చేస్తే తర్వాత వేసే పంటకు తెగులు సోకే అవకాశం ఉండదు.తరువాత పంట పొలంలో ఈ తెగుల నివారణకు పిచికారి మందులు ఉపయోగించాలి.డిక్సో హెక్స హైడ్రో ఇమిడాక్లోపిడ్- 2,4, ట్రి అజైన్ (DHT) -1,3,5 లతో పిచికారి చేసి ఈ తెగులను అరికడితే అధిక దిగుబడి పొందవచ్చు.








