ఏ సినిమా అయినా అందులో ఏ హీరో ఉన్న ఈ రోజుల్లో ట్రోలింగ్ తప్పడం లేదు.మన తెలుగు హీరోలు ఒకరిపై ఒకరు గౌరవం చూపిస్తున్న స్నేహంగా కలిసి మెలిసి ఉంటున్న ఫ్యాన్స్ మాత్రం అలా ఉండడం లేదు.
వారి మధ్య మాత్రం రచ్చ సాగుతూనే ఉంది.హీరో ఎవరైనా సరే వారి హీరో కాకుంటే యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ కు గురి అవ్వక తప్పదు.
ఆ హీరో సినిమాలో ఏ చిన్న పొరపాటు జరిగిన ఏ చిన్న లోపం కనిపించిన ట్రోలింగ్ తప్పదు.మరి ఆదిపురుష్ సినిమా విషయంలో కేసుల ఇదే జరిగింది.
ఆదిపురుష్ లో ప్రభాస్ ఉన్న.రామాయణం లాంటి ఇతిహాస కథ అయినప్పటికీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుండే ట్రోల్స్ చేసే వారికీ మంచి మసాలా దొరికింది.
వీరు ట్రోల్స్ బారి నుండి తప్పించుకోలేక సినిమాను సైతం వాయిదా వేశారు.

ఎన్నో ట్రోల్స్ తర్వాత నెగిటివ్ కామెంట్స్ ను పాజిటివ్ కామెంట్స్ గా మార్చేసి ఎట్టకేలకు ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది.ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా ”ఆదిపురుష్( Adipurush )”.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు రిలీజ్ అయ్యింది.
దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా కృతి సనన్(Kriti Sanon ) సీత పాత్రలో నటించింది.

బాలీవుడ్ స్టార్ హీరో లంకేశ్వరుడు రావణాసురుడిగా నటించగా ఈ సినిమా క్రేజ్ ట్రైలర్ నుండి పెరుగుతూ వచ్చింది.ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ రాజు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రభాస్( Prabhas ) ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.గత రెండు సినిమాల పరాభవం ఏ రేంజ్ లో ఉందొ తెలిసిందే.
మరి ఎట్టకేలకు ఆదిపురుష్ తో హిట్ అయితే దక్కించుకునేట్టుగానే ఉన్నాడు.మొత్తనికి ఇంతటి భారీ బడ్జెట్ సినిమాకు కూడా ట్రోలింగ్ తప్పలేదు.







