ఇవివి సత్యనారాయణ( E.V.V.Satyanarayana ) కొడుకు గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు అల్లరి నరేష్.అల్లరి అనే తన మొదట సినిమానే తనకి ఇంటి పేరుగా మారిపోయింది…ఈయన కెరియర్ మొదట్లో అన్ని కామెడీ సినిమాలు చేసేవాడు…కానీ కొద్దిరోజులుగా ఆ సినిమాలు సరిగ్గా అడకపోవడం తో ఇప్పుడు డిఫరెంట్ జానర్స్ సినిమాలని ట్రై చేస్తున్నాడు అందులో భాగం గా వచ్చిన సినిమాలే అల్లరి నరేష్ ఇటీవల చేసిన నాంది, ఉగ్రం వంటి రెండు సక్సెస్ఫుల్ మూవీస్…ఈ సినిమాలతో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చారు.

విజయ్ కనకమేడల తీసిన ఆ రెండు సినిమాల్లో కూడా ఎమోషనల్ క్యారెక్టర్స్ తో తన పెర్ఫార్మన్స్ అదరగొట్టి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు నరేష్.ఇక ఆయన నెక్స్ట్ మూవీ పై ఇప్పటికే టాలీవుడ్ లో ఆసక్తికరంగా చర్చ జరుగుతూ ఉండగా, లేటెస్ట్ బజ్ ప్రకారం అల్లరి నరేష్ తన నెక్స్ట్ మూవీని పీరియాడిక్ జానర్ లో చేయనున్నారని అంటున్నారు.

తొలిసారిగా అల్లరి నరేష్ ఇటువంటి జానర్ మూవీ చేస్తుండగా దీనిని అద్భుతంగా తెరకెక్కించేందుకు ప్రస్తుతం యువ దర్శకుడు సుబ్బు కథ, కథనాలు సిద్ధం చేస్తున్నారట.అన్ని అనుకున్నట్లు జరిగితే అతి త్వరలో ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.అదే నిజం అయితే అల్లరి నరేష్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అంటున్నాయి సినీ వర్గాలు…అయితే అల్లరి నరేష్( Allari Naresh ) ఒకపుడు మొత్తం కామెడీ సినిమాలు చేశాడు ఇప్పుడు థ్రిల్లర్ సినిమాలు చేస్తున్నాడు…కానీ వరుసగా అవే చేయడం వల్ల ఆయనకి చాలా పెద్ద మైనస్ అయ్యే అవకాశం కూడా ఉంది…ఒకప్పుడు కామెడీ ఎలా ఆయనకి మైనస్ అయిందో ఇప్పుడు ఇది కూడా ఇంకో 2 సినిమాలు పోతే బోర్ కొట్టేస్తది…అందుకే నరేష్ ఇంకో జానర్ లో సినిమా చేస్తే బాగుంటది








