మనదేశం గర్వించే, మనమందరం అనుసరించే శ్రీరామచంద్రుడి గాథ రామాయణం .దీనిని ఎన్ని సార్లు చదివినా, చూసినా, విన్నా తనివి తీరదు .
ఇంకా కావాలనిపించే.అమృత గానం శ్రీరామ నామం అలాంటి రాముని కథతో ప్రభాస్( Prabhas ) హీరోగా, కృతి శనన్ హీరోయిన్ గా , సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో, ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆదిపురుష్( Adipurush ) .పలు భారతీయ భాషల్లో విడుదల అవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.మొదట సినిమా పై కాస్త నెగిటివిటి వచ్చినా .ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది .మరి మంచి అంచనాలతో నేడు ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది .రాముడిగా ప్రభాస్ మెప్పించాడా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
ముందుగా కధ విషయానికి వస్తే ఇది మన అందరికి తెలిసిన రామాయణం కధ( story of Ramayanam ) ఆధారంగానే తెరకెక్కింది.
సీతను అపహరించడంతో మొదలు పెట్టి రాముడి ఆగమనం, అయోధ్య పరిచయం ఇలా రాముడి జీవితంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా చిత్రాన్ని రూపందించారు .అలాగే రామ, రావణ యుద్ధం కూడా కధలో కీలకంగా ఉంది.ముఖ్యంగా రాముడు అంటే ధర్మం భార్య కన్నా ధర్మానికి విలువ ఇస్తాడు అనేది సినిమాలోని ప్రధాన కధ అని చెప్పవచ్చు ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సినిమాని ఆసక్తికరంగా మొదలు పెట్టారు .రాముని ప్రియ భక్తుడైన హనుమంతుని కోణంలో రాముణ్ణి చూపిస్తూ ప్రేక్షకులని కధలో లీనం అయ్యేలా కధనాన్ని మొదలు పెట్టారు ఇక రాముడి ఆగమన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి .మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు రాముడి అని చెప్పే సీన్స్ ఆకట్టుకుంటాయి .రాముడి జీవితం ధర్మానికి సన్మార్గానికి నిదర్శనం అని చెప్పడమే సినిమా ముఖ్య ఉద్దేశ్యంగా కధనం సాగుతూ ఆకట్టుకుంటుంది .ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గూజ్ బంప్స్ ని తెప్పించేలా ఉంది .గరుడపక్షి విజువల్స్ ఓ రేంజ్ లో మెప్పించేలా ఉన్నాయి .చాలా సన్నివేశాలు ఓ విజువల్ ట్రీట్ ని అందిస్తాయి .చాలా సహజంగ అనిపిస్తున్న గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి.అయితే కొన్ని చోట్ల గ్రాఫిక్స్ ఇంకాస్త మెరుగ్గా ఉంటె బాగుండు అనిపిస్తాయి ఇక సీతాపహరణం తరువాత సినిమా మరో స్థాయికి చేరుతుంది.

యుద్దానికి సంబంధించిన సన్నివేశాలు బాగున్నాయి .లక్ష్మణుడు- రాముడు ధర్మం గురించే మాట్లాడే సీన్ నిజంగా హైలైట్ .అలాగే శబరి , రాముడి మధ్య సాగే ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది .దైవం మనుష్య రూపేనా అన్న మాటలకు నిదర్శనంగా ఆ సీన్ నిలుస్తుంది .మొదట సాత్వికంగా సాగిన రామాయాణం యుద్దకాండకు చేరిన తర్వాత మరింత ఆకట్టుకుంటుంది .హనుమాన్ తన బలాన్ని సమకేర్చుకొని సీతాదేవి కోసం సముద్రం దాటడం.లక్ష్మణుడికోసం సంజీవని పర్వతాన్న పెల్లుబిక్కూ రావడం విజువల్ గా చాలా బాగా చూపించారు .అలాగే అశోకవనంలో సీతా చెప్పే మాటాలు .రాముడిగా ప్రభాస్ చెప్పే కొన్ని డైలాగ్స్ మానవ జీవనం ఇలా సాగాలన్న ఆలోచన రేకెత్తేన్చేలా ఉన్నాయి .ఇక సీతాను రావణుడు చెరబట్టడానికి కారణం ఏంటి అని వివరించే సీన్స్ బాగున్నాయి .అయితే కొన్ని సన్నీవేశాలని ఇంకా బాగా చూపించవచ్చేమో అనిపిస్తుంది .

ఇక నటీనటుల విషయానికి వస్తే.రాఘవుడిగా ప్రభాస్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంది.రాముడి పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు.ఇక మరో ముఖ్యమైన పాత్ర సీత.ఆ పాత్రలో కృతి సనన్( Kriti Sanon ) యాప్ట్ అనిపించింది.రావణుడిగా సైఫ్ ఆలీ ఖాన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
సినిమాలో చేసిన ప్రతీ యాక్టర్ కి ఈ సినిమా ఓ ప్రత్యేకమైన మూవీగా నిలిచిపోవడం ఖాయం.శ్రీరాముని పాత్రలో ప్రభాస్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తీసుకురావడం పక్క .నటీనటులు తమ బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇక సాంకేతిక విషయాలకు వస్తే దర్శకుడు ఓం రౌత్( Director Om Rauth ) తాను అనుకున్న రామాయణ కధని తెరపై చూపించడంలో చాలావరకు సక్సెస్ అయ్యారు .అయితే కొని సన్నివేశాల మీద ఇంకాస్త ఫోకస్ చేస్తే ఇంకా బాగుండేది .కార్తీక్ సినిమాటోగ్రఫీ బాగుంది .విజవల్స్ ఆకట్టుకుంటాయి .అపూర్వ మోతివలె ,ఆశిష్ ఎడిటింగ్ ఒకే అనిపిస్తుంది .సంచిత బల్హార, అంకిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది .ఇక పాటలు సంగీత పరంగా అలరిస్తాయి .సినిమా నిర్మాణ విలువలు చాల బాగున్నాయి .ప్రతి ఫ్రెమ్ రిచ్ గా కనిపిస్తుంది మొత్తంగా చూస్తే.ప్రభాస్ రాముడిగా నటించిన ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు పుష్కళంగానే ఉన్నాయి
.







