తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ మూవీ( Adipurush Movie ) టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి.ఆదిపురుష్ సినిమా రిలీజ్ సమయానికి ఆకాశమే హద్దుగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా ఫస్ట్ డే టికెట్లకు డిమాండ్ నెలకొంది.రాముడి అవతారంలో బిగ్ స్క్రీన్ పై ఆదిపురుష్ మూవీని చూడటానికి ఉవ్విళ్లూరుతున్నామని ప్రభాస్ ఫ్యాన్స్( Prabhas Fans ) చెబుతున్నారు.
అయితే ఢిల్లీలోని( Delhi ) ఒక థియేటర్ లో ఆదిపురుష్ టికెట్ రేటు ఏకంగా 2200 రూపాయలుగా ఉంది.
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఢిల్లీ ఆంబియన్స్ మాల్ లోని పీవీఆర్ డైరెక్టర్స్ కట్ థియేటర్ లో అదనపు ఛార్జీలతో సంబంధం లేకుండానే ఈ సినిమా టికెట్ రేటు 2200 రూపాయలుగా ఉంది.
ఇంత రేటు పెట్టినా అభిమానులు మాత్రం ఎగబడి టికెట్లు కొంటున్నారు.తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎండలు మండిపోతున్న విధంగానే టికెట్ రేట్లు సైతం మండిపోతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో గరిష్టంగా 400 రూపాయల వరకు ఆదిపురుష్ టికెట్ రేట్లు( Adipurush Ticket Rates ) ఉన్నాయి.త్రీడీలో ఈ సినిమాను చూసే వాళ్లు 30 నుంచి 40 రూపాయల వరకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.ఆదిపురుష్ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కొన్ని థియేటర్లలో ఈ సినిమా బుకింగ్స్ ఇంకా మొదలు కావాల్సి ఉందని తెలుస్తోంది.

ప్రముఖ మల్టీపెక్స్ లలో ఆదిపురుష్ సినిమానే అన్ని స్క్రీన్లలో ప్రదర్శితం కానుందని తెలుస్తోంది.ఆదిపురుష్ సినిమా చూడటానికి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.ఆదిపురుష్ రిజల్ట్ ఎంతోమంది కెరీర్ ను డిసైడ్ చేయనుందని సమాచారం అందుతోంది.ఆదిపురుష్ మూవీ 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా 700 కోట్ల రూపాయల నుంచి బిజినెస్ జరిగింది.
నిర్మాతలకు శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా కూడా భారీ స్థాయిలో ఆదాయం దక్కుతోందని సమాచారం అందుతోంది.







