తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా, ప్రభాస్ (Prabhas) స్నేహితుడిగా, అతని అసిస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రభాస్ శీను ( Prabhas Seenu).ఇలా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తాజాగా ఓ బుల్లితెర కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా మాట్లాడారు.అయితే గతంలో ప్రభాస్ శీను సీనియర్ నటి తులసి(Thulasi) తో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలను అప్పట్లో ఖండించిన ప్రభాస్ శీను తాజాగా మరోసారి ఈ విషయం గురించి మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రభాస్ శీను మాట్లాడుతూ తులసి గారితో నాకు ఎఫైర్ ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.ఈ వార్త తనని చాలా బాధపెట్టిందని ఈయన తెలియజేశారు.ఆమె నా కన్నా ఎంతో పెద్ద నటి ఆమె ఇలాంటివి చాలా చూసి ఉంటారు.
ఇక డార్లింగ్ సినిమా (Darling Movie) లో ఆమె ప్రభాస్ కి తల్లి పాత్రలో నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో మేము తనని చాలా జాగ్రత్తగా చూసుకున్నామని తెలిపారు.
అయితే ఓ సందర్భంలో ఆమె నన్ను డార్లింగ్ అని పిలవడమే ఈ పుకార్లకు కారణమైంది అంటూ ప్రభాస్ శీను తెలిపారు.తను ఏదో సరదాగా అలా పిలిచారని ఈయన తెలియచేశారు.

ఇక మా ఇద్దరి గురించి ఇలాంటి వార్తలు వచ్చిన సమయంలో మొదట తులసి గారి నాకు ఇలాంటి వార్తలు వస్తున్నాయి అంటూ మెసేజ్ చేశారని అదేవిధంగా ఈ విషయం ముందుగా మీ భార్యకు చెప్పేసేయ్ లేకపోతే తను కూడా అపార్థం చేసుకుంటుంది అంటూ తనకు సలహా ఇచ్చారని తెలిపారు.ఇక తన భార్య ఇలాంటి వాటి గురించి ఏమాత్రం పట్టించుకోదని తెలిపారు.ఆమె ఒక డాక్టర్ అని తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ప్రభాస్ శీను ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ విధంగా తులసి గారితో తనకు ఎఫైర్ ఉందంటూ వచ్చిన వార్తలలో ఏ మాత్రం నిజం లేదని, ఆవిడ తనకు ఒక తల్లితో సమానం అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.