తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు అటు హీరోలు, దర్శకులకు అభిమానులకు ప్రేక్షకులకు పండగే అని చెప్పవచ్చు.ఎందుకంటే కొత్త ఏడాది రాబోతున్న మొదటి సినిమాకి సినిమా విడుదల చేయాలని చాలామంది సంక్రాంతి బరిలోకి దిగుతూ ఉంటారు.
దీంతో ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు మూవీ మేకర్స్.ఇకపోతే 2024 సంక్రాంతికి ఏ సినిమాలు రాబోతున్నాయి.
ఏ ఏ హీరోలు పోటీ పడబోతున్నారు అన్న అంశాలు ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.

ఇప్పటికే మహేష్ బాబు-త్రివిక్రమ్( Mahesh babu )) కాంబోలో రాబోతున్న సినిమా విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.కానీ ఆ సినిమా పరిస్థితులు చూస్తుంటే సంక్రాంతికి విడుదల అయ్యేది కష్టమే అని అనిపిస్తోంది.ఈ సినిమా విడుదల పెట్టి దాదాపు ఆరు నెలలు పూర్తి కావస్తున్నా కూడా ఇప్పటికీ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొలిక్కి రాలేదని చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే ప్రభాస్-నాగ్అశ్విన్( Nag Ashwin ) కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కూడా సంక్రాంతికి అనే ప్రకటించారు.దీనికి కూడా ఇంకా చాలా భారీ షూట్, టెక్నికల్ వర్క్, ఇంకా చాలా అంటే చాలా వున్నాయి.

ఇవన్నీ ఆరునెలల్లో పూర్తి చేసుకుని సంక్రాంతికి రావాల్సి ఉంది.మరి ఈ సినిమా కూడా ఆరు నెలల్లో అవన్నీ పూర్తి చేసుకొని సంక్రాంతికి బరిలోకి దిగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి.ఇక మాస్ మహారాజా రవితేజ ( Raviteja )దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్లో రాబోతున్న సినిమా కూడా సంక్రాంతికి రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.కానీ ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని విడుదల చేయలేదు మూవీ మేకర్స్.
ఇలా మొత్తం మూడు సినిమాలు సంక్రాంతికి బరిలోకి దిగడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.అంటే వచ్చే సంక్రాంతికి ప్రభాస్, మహేష్ బాబు, రవితేజల మధ్య పోటీ జరగబోతుందన్నమాట.








