9ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీకి అడుగు దూరంలో ఓటమి చవిచూస్తున్న భారత్..!

తాజాగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్( WTC 2023 Final match ) లో భారత్ ఘోర ఓటమిని( India’s heavy defeat ) చవిచూసింది.తొమ్మిదేళ్లుగా ఐసీసీ ట్రోఫీకి( ICC trophy for nine years ) అడుగు దూరంలో భారత్ ఘోర ఓటములను ఖాతాలో వేసుకుంటోంది.

 One Step Away From The Icc Trophy Since 9 Years Details, Sports News,cricket New-TeluguStop.com

ఒక లీగ్ లో కష్టపడి ఫైనల్ వరకు జట్టు వెళ్లిందంటే దాని వెనక ఎంత శ్రమ ఉంటుందో అందరికీ తెలిసిందే.ఒకసారి లేదా రెండు సార్లు ఫైనల్ మ్యాచ్లో ఓడి టైటిల్ చేజారితే పర్వాలేదు కానీ ఏకంగా తొమ్మిది సార్లు భారత జట్టు ఐసీసీ టైటిల్( ICC Titles ) చేజార్చుకుంది.

భారత జట్టు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ( Indian Team ICC Champions Trophy ) గెలిచి దశాబ్ద కాలం అయ్యింది.మహేంద్రసింగ్ ధోని భారత జట్టు కెప్టెన్ గా ఉన్నప్పుడు 2013లో ఛాంపియన్ ట్రోఫీ టీం ఇండియా గెలిచింది.

అప్పటినుంచి ఐసీసీ ట్రోఫీ కేవలం కలగానే మిగిలిపోయింది.

భారత్ 2013 తరువాత నాలుగు సార్లు ఐసీసీ ట్రోఫీ ఫైనల్ లో ఓడింది.మరో నాలుగు సార్లు సెమీఫైనల్ లో ఓడింది.ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

2014లో టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక చేతిలో భారత్ ఓటమిని చవిచూసింది.2015లో వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి చవిచూసింది.ఇక 2016లో టీ 20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోయింది.2017లో ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోయింది.2019లో వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది.ఇక 2021 డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది.2021 టీ 20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలోనే భారత్ ఓడుతూ ఇంటికి చేరింది.2022 టీ 20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది.ఇక తాజాగా జరిగిన డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో భారత్ ఘోరంగా ఓడిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube