శ్రీరెడ్డి( Sri Reddy ) సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ ఒకింత హాట్ టాపిక్ అవుతుంది.శ్రీరెడ్డికి సోషల్ మీడియాలో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.
ఫేస్ బుక్ లో శ్రీరెడ్డికి ఏకంగా 6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.కొన్నిసార్లు అందరికీ నచ్చేలా పోస్టులు పెట్టి ప్రశంసలు పొందే శ్రీరెడ్డి మరి కొన్నిసార్లు మాత్రం తన పోస్టుల ద్వారా విమర్శల పాలవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను( Pawan Kalyan ) టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.శ్రీరెడ్డి తన పోస్ట్ లో వరుణ్ తేజ్ లావణ్యల( Varuntej Lavanya ) నిశ్చితార్థానికి పవన్ హాజరైన ఫోటోను షేర్ చేస్తూ నలుగురు పెళ్లాలు ఉన్నా ఒంటరోడే నా దేవుడు అని పేర్కొన్నారు.
నన్ను రమ్మంటే వచ్చేదాన్ని కదా పావలా బావ అంటూ సెటైరికల్ గా శ్రీరెడ్డి కామెంట్లు చేశారు.

ఈడు జోడుగా చెట్టా పట్టాలేసుకుని నాగబాబు కళ్ళ ముందు తిరిగితే నా సామి రంగా అంటూ శ్రీరెడ్డి చేసిన కామెంట్లు ఒకింత హాట్ టాపిక్ అవుతున్నాయి.ఆ పోస్ట్ కింద కామెంట్ లో చెరిగిపోయిన జుట్టేసుకుని.నలిగిన షర్టేసుకుని అయ్యో నా దేవుడా.
నేను లేకపోతే పిచ్చోడయిపోయేలా ఉన్నాడమ్మా నా దేవుడు అంటూ సెటైరికల్ గా శ్రీరెడ్డి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

శ్రీరెడ్డి గురించి నెగిటివ్ కామెంట్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ శ్రీరెడ్డి వ్యక్తిగత జీవితం గురించి కామెంట్లు చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.శ్రీరెడ్డి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం వల్లే ఆమె పవన్ ను ట్రోల్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
శ్రీరెడ్డి వివాదాలకు దూరంగా ఉండాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.







