ప్రమాద నిలయంగా ఉన్న ఎగ్జిబిషన్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలి: డివైఎఫ్ఐ డిమాండ్

నాసిరకమైన పరికరాలతో, అన్ని రకాల అనుమతులు తీసుకోకుండా ప్రమాద నిలయంగా మారినఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ ఎగ్జిబిషన్( Pavilion Ground ) నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఖమ్మం మేయర్ పునుకుల నీరజ కి వినతి పత్రం అందజేశారు.స్పందించిన మేయర్ నీరజ మాట్లాడుతూ నిబంధనకు విరుద్ధంగా ఎగ్జిబిషన్ నిర్వహిస్తే నిర్వాహకులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 Action Should Be Taken Against Dangerous Exhibition Organizers: Dyfi Demands-TeluguStop.com

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.

డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్( Sheikh Bashiruddin ) మాట్లాడుతూ నాశరకమైన పరికరం ఉపయోగిస్తున్న పాటుగా, ఎక్కువ ధరలు పెట్టి నగర ప్రజలను మోసం చేస్తున్నారని, ఏ పరిస్థితులైన ఆ నాసిరకం పరికరాలు కిందపడితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని, తుప్పు పట్టిన యంత్రాలు, పాడైపోయిన పరికరాలు, కాలం తీరిన వస్తువులతోనే ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారని ఇలాంటి యాజమాన్యాల పైన కచ్చితంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాదు నీ ప్రమాదం జరగకముందే అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఆయన సందర్భంగా సూచన చేశారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి లు చింతల రమేష్( Chintala Ramesh ), కూరపాటి శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు రావులపాటి నాగరాజు, యాట రాజేష్, నాయకులు గోపి, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube