హైదరాబాద్ లో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నారు.ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి నేతృత్వంలో సమావేశాలు జరగనున్నాయని తెలుస్తోంది.29 రాష్ట్రాలతో పాటు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు హాజరుకానున్నారు.త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ కార్యవర్గ సమావేశాలలో ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం.