కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద వివాదాలు కూడా మారవచ్చు.అలాంటి చిన్న చిన్న తప్పులకు కొన్నిసార్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఒక టీవీ ఛానల్ పరిస్థితి అదే విధంగా ఉంది.తెలుగు పాపులర్ టీవీ ఛానల్ కి ఇలాంటి అనుభవమే ఎదురైంది.
ఆ చానల్ ని బాయ్ కాట్ చేయమంటూ ఎన్టీఆర్( NTR ) అభిమానులు పిలుపునిస్తున్నారు.అసలేం జరిగిందంటే.
ఎన్టీఆర్, పవన్ సినిమాలు,పొలిటికల్ కెరీర్ లపై ఒక వార్త ఐటెం చేసి ప్రసారం చేసారు.

అందులో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఫొటోలో ఎన్టీఆర్ ని మార్ఫింగ్ చేసింది ఉంది.అది గమనించకుండా ఆ ఫొటోని పోగ్రామ్ లో వాడేసారు.ఇప్పుడు అదే పెద్ద వార్త అయ్యి కూర్చుంది.
వెంటనే క్షమాపణ చెప్పాలని ఆ టీవి ఛానెల్ ని కోరడంతో పాటుగా అప్పటిదాకా బాయ్ కాట్( Boy cat ) చేయమని తోటి అభిమానులకు పిలుపు ఇస్తున్నారు.ఇంకొందరు అభిమానులు ప్రముఖ టీవీ ఛానల్ పై విమర్శలు గుప్పించడంతోపాటు భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఇంత దిగజారిపోవడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.

ప్రస్తుతం కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో రూపొందుతున్న దేవర( Devara ) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే.ఒక సినిమా ఇంకా విడుదల కాకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు పవన్.
ఈ క్రమంలోని హరిహర వీరమల్లు,బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు పవన్.







