వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి వెడ్డింగ్ వీడియో చిత్రీకరించబోతున్న స్టార్ డైరెక్టర్..ప్లానింగ్ మామూలుగా లేదు!

సోషల్ మీడియా లో ఎంతో కాలం నుండి ప్రచారం అవుతున్న వరుణ్ తేజ్( Varun Tej ) మరియు లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) ప్రేమవ్యవహారానికి ఇక శుభం కార్డు పడబోతోంది.ఈ నెల 9 వ తారీఖున వీళ్లిద్దరి నిశ్చితార్ధ వేడుక జరగబోతుందని రీసెంట్ గా వచ్చిన ఒక వార్త తెగ వైరల్ గా మారిన సంగతి మన అందరికీ తెలిసిందే.‘మిస్టర్’ సినిమాతో ప్రారంభమైన వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి స్నేహం, ఆ తర్వాత ప్రేమ గా మారింది.వీళ్లిద్దరి కలిసి రెండవసారి ‘అంతరిక్షం’ అనే సినిమాలో నటించారు.

 Director Gautam Vasudev Menon To Record Varun Tej Lavanya Tripathi Marriage Cele-TeluguStop.com

ఈ చిత్రం ప్రారంభం అయ్యే ముందే వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారట.అయితే కొన్ని రోజులు లివింగ్ రిలేషన్ షిప్ చేసిన తర్వాత, ఓకే అనిపిస్తే పెళ్లి చేసుకుందామని వరుణ్ తేజ్ తెచ్చిన ప్రపోజల్ కి ఓకే చెప్పింది లావణ్య త్రిపాఠి.

అప్పటి నుండి వీళ్లిద్దరు లివింగ్ రిలేషన్ షిప్ లోనే ఉన్నారు.కానీ సోషల్ మీడియా వల్ల వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం బయట పడింది.

Telugu Gautamvasudev, Nagababu, Varun Tej, Varuntej-Movie

సోషల్ మీడియా లో ఇలాంటివి బయటకి వస్తే వంద కథనాలు అల్లేస్తారని భయపడిన లావణ్య త్రిపాఠి, పలు ఇంటర్వ్యూస్ లో మా మధ్య ఏమి లేదని చెప్పుకొచ్చింది.ఆమె అలా అన్నప్పటికీ కూడా ఆమె మాటలను ఎవ్వరూ నమ్మలేదు, అలాగే వీళ్లిద్దరి పై సోషల్ మీడియా లో రోజు ఎదో ఒక న్యూస్ రాకుండా లేదు.అలా ఇన్ని రోజులు గోప్యంగా ఉంచిన వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం ఇప్పుడు బట్టబయలు అయ్యింది.ఈ నెల 9 వ తారీఖున హైదరాబాద్ లో బందు మిత్రులు మరియు కొంతమంది సినీ ప్రముఖుల మధ్య వీళ్లిద్దరి నిశ్చితార్ధ మహోత్సవం( Engagement ) జరగబోతుంది.

అయితే వీళ్ళ పెళ్లి వేడుక మాత్రం ఇప్పటి వరకు టాలీవుడ్ హిస్టరీ లో కనీవినీ ఎరుగని రీతిలో జరిపించడానికి సన్నాహాలు చేస్తున్నాడు నాగబాబు.తన ముద్దుల కూతురు నిహారిక కొణిదెల పెళ్లి ఆయన ఎంత ఘనంగా జరిపించాడో అందరికీ తెలిసిందే.

వరుణ్ తేజ్ పెళ్లి( Varuntej Marriage ) అంతకు మించి ఉండే లాగ ప్లాన్ చేస్తున్నాడట నాగబాబు.

Telugu Gautamvasudev, Nagababu, Varun Tej, Varuntej-Movie

అయితే ఈ పెళ్లి వెడ్డింగ్ వీడియో ని ఒక ప్రముఖ దర్శకుడి చేత చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.ఆ ప్రముఖ దర్శకుడు మరెవరో కాదు, గౌతమ్ వాసుదేవ్ మీనన్.( Gautam Vasudev Menon ) ఈయన గతం లో నయనతార మరియు విగ్నేష్ పెళ్లి వేడుకలను కూడా చిత్రీకరించాడట.

మళ్ళీ ఆయన పర్యవేక్షణలోనే వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలను చిత్రీకరించబోతున్నట్టు సమాచారం.ఇందుకోసం ఆయనకీ ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట.అంతే కాదు పెళ్లి మండపం అందంగా ఉండే విధంగా ప్రముఖ కళా దర్శకుడు ఆనంద్ సాయి మండపం డిజైన్స్ చేయబోతున్నాడట.ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా ఈ వివాహ మహోత్సవాన్ని జరిపేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యినట్టు సమాచారం.

అయితే ఈ పెళ్లి ఎప్పుడు జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది అనే విషయాలు 9 వ తారీఖు తర్వాతనే తెలుస్తుందట.చూడాలి మరి ఈ జంట పెళ్లి వైభోగం ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube