కౌలు రైతుల నిజ జీవితంలో జరిగే పలు సంఘటనలను ఉదహరిస్తూ ఆర్.వి.రెడ్డి బ్యానర్లో నంద్యాల సాయి కళ్యాణ్( Sai Kalyan ) దర్శకత్వం వహించిన చిత్రం పుడమి.కాగా ఇందుకు సంబంధించిన సినిమా పోస్టర్ ను చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి( Ponguleti Srinivas Reddy ) శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
గ్రామీణ నేపధ్యంలో చిత్రీకరించిన ఈ సినిమాను సినీ ప్రేక్షకులు, అభిమానులు ఆదరించాలని ఈ సందర్భంగా పొంగులేటి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ బాధ్యులు నంద్యాల సాయి కళ్యాణ్, చింతమళ్ళ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.







