నల్లగొండ జిల్లా
:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తితో ఘనంగా సాగాయి.21 రోజుల పాటు కొనసాగనున్న అవతరణ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం ( Telangana State Independence Day )జూన్ 2 పురస్కరించుకొని అంతటా అమరవీరుల స్థూపాలకు నివాళులర్పించారు.అనంతరం ప్రభుత్వ కార్యాలయాలలో అధికారికంగా జాతీయ పతాకావిష్కరణలు నిర్వహించారు.విద్యాసంస్థలలో,ఉద్యోగ, ప్రజాసంఘాలు,పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణలతో రాష్ట్ర అవతరణ ఉత్సవాలను సంబురంగా జరుపుకున్నారు.
నల్గొండ జిల్లాలో
:
కలెక్టరేట్ లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేసి దశాబ్ది అవతరణ ఉత్సవాల సందేశాన్ని వినిపించారు.కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి( Vinay Krishnareddy ), జాయింట్ కలెక్టర్ కుష్బూ గుప్తా,ఎస్పీ అపూర్వరావు తో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు,పలు శాఖల అధికారులు వేడుకలకు హాజరయ్యారు.

సూర్యాపేట జిల్లాలో
:
మంత్రి జి.జగదీష్ రెడ్డి పతాకావిష్కరణ చేసి అవతరణ దినోత్సవం సందేశం వినిపించి,రాష్ట్ర ఏర్పాటు పిదప సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు.వేడుకలలో కలెక్టర్ ఎన్.వెంకట్రావుతో( N Venkatrao ) పాటు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హజరయ్యారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో
: కలెక్టరేట్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేసి ప్రసంగించారు.కలెక్టర్ పమేలా సత్పతి,జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.బీఆర్ఎస్, కాంగ్రెస్,టీజేఎస్,టిడిపి, బీజేపీ,కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోనూ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ర్యాలీలు నిర్వహించి పార్టీ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.