ఎవరు ఈ ప్రాంక్ స్టార్ కిరణ్ మచ్చ.. యూట్యూబ్ టూ సినిమాకు ఎలా వచ్చాడు ?

సోషల్ మీడియా( Social Media ) ద్వారా సినిమా ఇండస్ట్రీకి వస్తున్న వారు ఈమధ్య ఎక్కువైపోయారు.తమలో ఉన్న టాలెంట్ ని రకరకాల పద్ధతుల్లో బయట ప్రపంచానికి తెలియజేసి ఏదో ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలో పాతుకు పోవాలనే ఆశయంతో చాలా మంది సోషల్ మీడియాలో అష్ట కష్టాలు పడుతున్నారు.

 Prank Star Kiran Maccha Movies Details, Prank Star Kiran Maccha,memu Famous Movi-TeluguStop.com

అలా ఓవర్ నైట్ సెలబ్రిటీలు అవుతున్నవారు కొంత మంది అయితే మరి కొంత మంది చాలా రోజుల పాటు ఎదురుచూడాల్సి వస్తుంది.అలా ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని ఏళ్ల పాటు అవకాశాల కోసం ఎదురు చూసిన వారిలో ప్రాంక్ స్టార్ కిరణ్ మచ్చ( Pranck star Kiran macha ) ఒకరు.

సోషల్ మీడియాలో చాలా రోజులుగా కిరణ్ మచ్చ ప్రాంక్ స్టార్ గా కొనసాగుతున్నారు.

Telugu Adharya, Kiran Maccha, Kiranmaccha, Kiranmacha, Memu, Youteberkiran, Yout

అయితే కిరణ్ మెం ఫేమస్ సినిమా( Mem Famous movie ) ద్వారా తొలిసారిగా సినిమా ఇండస్ట్రీకి కూడా పరిచయమయ్యారు.ఈ సినిమాలో అల్లరి చిల్లరగా తిరుగుతున్న యువతకు వెన్నంటి ఉంటూ వారు ఏదైనా సాధించగలరని మోటివేట్ చేసే సర్పంచ్ వేణు జింక అనే ఒక పాత్రలో కిరణ్ నటించాడు.ఊరంతా ఒకటిగా వ్యతిరేకించిన యువతకు ఇతను మాత్రం సపోర్ట్ చేస్తూ వారిని పైకి ఎదగాలని వారి వెనకాలే అండగా ఉంటాడు.

అలా అద్భుతంగా సర్పంచ్ పాత్రలో నటించాడు కిరణ్.ఈ సినిమా తర్వాత అతడికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి.వేణు జింక పాత్రలో కిరణ్ చాలా చక్కగా నటించాడు ఈ పాత్ర సినిమాకి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.

Telugu Adharya, Kiran Maccha, Kiranmaccha, Kiranmacha, Memu, Youteberkiran, Yout

ప్రస్తుతం కిరణ్ మచ్చ దాదాపు 5 సినిమాల్లో బుక్ అయ్యాడు.అధర్వ, శ్రీరంగనీతులు అనే రెండు చిత్రాలతో పాటు ఇప్పటికీ పేరు పెట్టని కొన్ని చిత్రాలకు కూడా కిరణ్ ఒకే కాగ ఒకప్పుడు యూట్యూబర్ గా ఫేమస్ అయి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుండడం నిజంగా గొప్ప విషయమే.ఇక రానున్న మరికొన్ని రోజుల్లో కిరణ్ మచ్చ పేరు ఖచ్చితంగా ఇండస్ట్రీలో టాప్ లో వినిపిస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube