హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేశుడికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.ప్రతి సంవత్సరం వినాయక చతుర్థి వేడుకలలో ఈ విగ్రహం స్పెషల్ గా నిలుస్తుంది.
ఈ క్రమంలోనే ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు 50 అడుగులు ఉండనుందని తెలుస్తోంది.ఈ మేరకు భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది.
ఇందులో భాగంగా విగ్రహ తయారీ నేపథ్యంలో నిర్వాహకులు ఇవాళ కర్ర పూజ నిర్వహించనున్నారు.







