మే 30వ తారీకుతో ఆంధ్ర ప్రదేశ్ లో జగన్( YS Jagan Mohan Reddy ) ప్రభుత్వం నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంది అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత అనేక పరిణామాల మద్య కాంగ్రెస్కు దూరమై సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్న జగన్ 2014 ఎన్నికలలో పూర్తిస్థాయి అధికారం సాధించలేకపోయినప్పటికీ గణనీయమైన స్థాయిలోనే సీట్లను సంపాదించుకున్నారు.జరిగిన తప్పులను పొరపాట్లను సమీక్షించుకొని సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టి ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు.
175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 151 యొక్క సీట్లతో కనీ వినీ ఎరుగని విజయాన్ని నమోదు చేశారు .ఇక అప్పటి నుంచి తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు తండ్రి వారసత్వాన్ని అందుపుచ్చుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో ఆయన ముందుకు వెళుతున్నారు.

వైయస్ హయాంలో ఆరోగ్యశ్రీ( Aarogyasri ) ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు పేద మధ్యతరగతి వర్గాలకు సంజీవని లాగా ఉపయోగపడ్డాయి.ఆ రెండు పథకాల వల్లే ఆయనను ఇప్పటికీ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు .ఆ స్థాయిలో జగన్ అమ్మ ఒడి పథకాన్ని ( Amma Vodi )చెప్పుకోవచ్చు .విద్యాదీవన వసతి దీవెన లాంటి పథకాలతో పేద ,మధ్యతరగతి వర్గాల చదువుకు తోడ్పడ్డారు.అంతేకాకుండా ఇంగ్లీష్ విద్య బోధన అమలు లోకి తీసుకురావటం విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా విద్య పరంగా ఆంధ్రప్రదేశ్లో ఆయనకు మంచి మార్కులే పడ్డాయి .అలానే చిన్న కుటీర పరిశ్రమల వారికి, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ,ఆటో వాలాలకు ,మధ్యతరగతి స్త్రీలకు, ఇలా సమాజంలో మెజారిటీ వర్గాలను కవర్ చేసేలా ఆయన అనేక పథకాలకు రూపకల్పన చేశారు.వృద్ధాప్య పింఛన్లు వికలాంగ పింఛన్లు సమయానికి అందేలా చేశారు .అద్బుతమైన వాలంటీర్ నెట్వర్క్ ఏర్పాటు చేసి ఈ పధకాలు అన్నీ అవినీతి కానీ ఆలస్యం కానీ లేకుండా ప్రజల ఇంటి వద్దే అందే ఏర్పాటు చేశారు.

అయితే మరోపక్క ఆయన ప్రభుత్వం పై విమర్శలు లేకపోలేదు .సంక్షేమం మీద పెట్టిన దృష్టి అభివృద్ధిపై పెట్టకపోవడం ,భారీ స్థాయి సంక్షేమానికి అమలు చేయాల్సిన నిధులను అప్పు రూపంలో తీసుకురావడం, ఇది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు ఆర్దికం గా గుదిబండగా మారుతుందని, రాష్ట్రం అప్పుల కుప్ప అవుతుందని మేధావుల సైతం వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి .అంతేకాకుండా ప్రతిపక్ష నేతలపై ప్రతీకార చర్యలకు పాల్పడటం ,వారి ఇళ్లను కూల్చివేయటం లాంటివి వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది .అన్నిటికంటే ముఖ్యంగా మౌలిక సదుపాయాల పట్ల జగన్ సర్కార్ శ్రద్ధ చూపించలేదు.రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరయిన రహదారి వ్యవస్థ గాని, డ్రైనేజీ వ్యవస్థ గాని సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు .ఎన్నికల సంవత్సరమైనందున జగన్ ప్రభుత్వం ఈ విషయంలో సరైన చర్యలు తీసుకొని తప్పులు సరి చేసుకుంటే ఆయన సంక్షేమ పథకాలు మరొకసారి ఆయన ను అందలం ఎక్కిస్తాయని చెప్పవచ్చు .