టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Rama charan ) తన తోటి స్టార్ హీరోలందరితో ఎంతో స్నేహం గా ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు మరియు ప్రభాస్ ఇలా ప్రతీ ఒక్కరూ ఆయనకీ ఎంతో ఆప్త మిత్రులు.
మిగిలిన స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ ఆయన కుటుంబం లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రీసెంట్ సమయం లో ఆయన బాగా క్లోజ్ అయిన వ్యక్తి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.
బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం లో ప్రభాస్( Prabhas ) రామ్ చరణ్ తో చేసిన చిట్ చాట్ చూస్తే వాళ్లిద్దరూ ఎంత మంచి స్నేహితులో అర్థం అవుతుంది.వీళ్లిద్దరి మధ్య ‘రా’ అని పిలుచుకునేంత చనువు ఉందా అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు.
అంతే కాకుండా రామ్ చరణ్ ఎప్పటి నుండో ప్రభాస్ మరియు అతని స్నేహితులు కలిసి నడుపుతున్న యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక పార్ట్నర్ గా ఉంటూ వచ్చాడు.

అయితే యూవీ క్రియేషన్స్ ఇప్పుడు రెండు చీలిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.రీసెంట్ గానే రామ్ చరణ్ , యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒకరైన విక్రంతో కలిసి V మెగా పిక్చర్స్ అనే సంస్థ ని ఏర్పాటు చేసారు.దీనికి యూవీ క్రియేషన్స్ కి ఎలాంటి సంబంధం లేదు, కేవలం అందులో సంబంధించిన వ్యక్తితో కలిసి రామ్ చరణ్ ఈ సంస్థ ని స్థాపించాడు.
ఇందులో మొదటి సినిమా ‘ఇండియా హౌస్‘ అని రీసెంట్ గానే అధికారిక ప్రకటన చేసారు.నిఖిల్ హీరో గా నటిస్తున్న ఈ సినిమా స్వతంత్ర పోరాట యోధుడు సర్వకర్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారు.
ఇది కాసేపు పక్కన పెడితే యూవీ క్రియేషన్స్ నుండి రామ్ చరణ్ బయటకి ఎందుకు వచేసాడు.ప్రభాస్ తో ఏమైనా విబేధాలు ఏర్పడ్డాయా?, లేదా తన సొంత అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేసేందుకు రామ్ చరణ్ బయటకి వచేసాడా అనేది తెలియాల్సి ఉంది.

అయితే కొంతమంది చెప్పేది ఏమిటంటే , రామ్ చరణ్ యూవీ క్రియేషన్స్ నుండి బయటకి రాలేదని, అందులో ఉంటూనే ప్రత్యేకంగా మరొకటి స్థాపించాడని అంటున్నారు.ఇందులో ఏది నిజమో , ఏది అబద్దమా ఎవరికీ తెలియదు.ఇకపోతే ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్( Adipurushn )’ చిత్రం వచ్చే నెల 16 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ విడుదలై ఆడియన్స్ లో మరియు ఫ్యాన్స్ లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.
మరి సినిమా కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో లేదో చూడాలి.ఇక ప్రభాస్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు.
షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.







