జగన్ కు షాక్.. ఎవరా "రహస్య సాక్షి " ?

వైఎస్ వివేనంద రెడ్డి( YS Vivekanandha reddy ) మర్డర్ కేసులో రోజుకో కొత్త చర్చ తెరపైకి వస్తోంది.ప్రస్తుతం వైఎస్ అవినాష్ రెడ్డి( YS Avinash reddy ) చుట్టూ తిరుగుతున్న ఈ కేసులో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టంగా ఉంది.

 Twist In Viveka's Murder Mystery Details, Latest Political News,ysrcp,cm Jagan,y-TeluguStop.com

ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్ట్ కాగా.ప్రస్తుతం నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే వార్తలు గట్టిగానే వినిప్శితున్నాయి.

ఇక ఈ కేసులో సిబిఐ అవినాష్ రెడ్డి మద్య చేటు చేసుకుంటున్న ఆసక్తికర పరిణామాలు అందరి ఆలోచనలో పడేస్తున్నాయి సిబిఐ విచారణ ఉన్న ప్రతిసారి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టు అను ఆశ్రయించడం.కోర్టు నుంచి అవినాష్ రెడ్డికి ఊరట లభిస్తుండడంతో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో విశ్లేషకులకు సైతం అంతుబట్టడం లేదు.

Telugu Avinash Reddy, Avinashreddy, Cm Jagan, Jaganavinash, Latest, Vivekanandha

ఇదిలా ఉంచితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై గత రెండు రోజులుగా తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాదుల వాదనలు సిబిఐ ( CBI )తరుపు వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును బుదవారానికి వాయిదా వేసింది.అయితే సిబిఐ వాదనలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.వివేకా మర్డర్ విషయం ఏపీ సి‌ఎం వైయెస్ జగన్( CM YS Jagan ) కు ముందే తెలుసని, హత్య జరిగిన రోజు ఉదయమే జగన్ కు ఆ విషయంపై అవినాష్ రెడ్డి పోన్ లో సంభాషించారని సిబిఐ తన వాదనలలో పేర్కొంది.

Telugu Avinash Reddy, Avinashreddy, Cm Jagan, Jaganavinash, Latest, Vivekanandha

అంతే కాకుండా 2019 ఎన్నికల్లో కడప ఎంపీ సీట్ అవినాష్ రెడ్డికి ఇవ్వొదని.ఆ సీటు విజయమ్మకు గాని లేదా షర్మిలకు గాని ఇవ్వాలని వివేకా జగన్ పై ఒత్తిడి తెచ్చారని ఈ పరిణామలే ఆయన హత్యకు దారి తీశాయని ఓ రహస్య సాక్షి వెల్లడించినట్లు సిబిఐ తన వాదనలలో పేర్కొంది.అయితే ఎప్పుడు ఎవరా రహస్య సాక్షి అనే దానిపై ఏపీ హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.ప్రస్తుతం వివేకా హత్య కేసులో జగన్ పేరు కూడా సిబిఐ ప్రస్తావనలోకి రావడంతో ఆయన ఏవిధంగా స్పధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఆ రహస్య సాక్షిని సిబిఐ బయట పెడుతుందా ? ఒకవేళ పెడితే ఆ తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొనున్నాయి అనేది ఆద్యంతం ఆసక్తి రేపుతున్న ప్రశ్న.మరి వీటన్నిటికి సమాధానం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube