టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారినటువంటి వారిలో యంగ్ బ్యూటీ శ్రీ లీల( Sreeleela ) ఒకరు.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు అందరి సరసన అవకాశాలు అందుకొని ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమెకు తాజాగా హైదరాబాద్ లో జరిగిన యోగా మహోత్సవ్ ( Yoga Mahostav ) కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా అందరితో కలిసి కొన్ని యోగాసనాలు వేసింది.
ప్రతి ఒక్కరు యోగా చేయాలని చూచించారు.సూర్య నమస్కారం లాంటి చిన్న చిన్న ప్రక్రియలతో యోగా మొదలుపెడితే, అది నిత్య జీవితంలో భాగం అవుతుందని ఈమె తెలియ చేశారు.

ఈ విధంగా ప్రతి ఒక్కరు యోగా చేయటం వల్లమన శరీరంలో ఒక రకమైన ప్రక్రియ జరుగుతుందని తద్వారా మనం ఎంతో ఉత్సాహంగా ఉండటమే కాకుండా ఆలోచన విధానం శరీర ఫిట్ గా ఉంటుందని ఈమె తెలియ చేశారు.ఇక ఈమె తన అందాన్ని కాపాడుకోవడానికి తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి తాను పెద్దగా వర్కౌట్స్ కూడా చేయనని, ఎక్కువగా యోగా( Yoga )కి ప్రాధాన్యత ఇస్తాను అంటూ ఈమె ఈ సందర్భంగా తన బ్యూటీ సీక్రెట్ బయట పెట్టారు.ఇక చాలామంది హీరోయిన్స్ తమ శరీర ఫిట్నెస్ కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ ఉంటారు.

ఇక శ్రీలీల విషయానికి వస్తే ఈమె ఇలాంటి వాటిని చాలా దూరంగా ఉంటారని కేవలం యోగ ద్వారా మాత్రమే తన అందాన్ని కాపాడుకుంటున్నానని ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ధమాకా( Dhamaka )వంటి బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ప్రస్తుతం ఈమె దాదాపు ఏడు సినిమాల వరుకు తన చేతిలో ఉన్నాయని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈమె రామ్, మహేష్ బాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నితిన్ వంటి హీరోల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.







