సురేఖ వాణి రెండో పెళ్లి కోసం ఎదురు చూస్తుందా... ఆ పోస్టుకు అర్థం అదేనా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే.ఆరు పదుల వయసులో కూడా ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకోవడం ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.

 Is Surekha Vani Waiting For Her Second Marriage Details,second Marriage,surekhs-TeluguStop.com

ఇలా ఎంతోమంది లేటు వయసులో ఘాటు ప్రేమలో మునికి తేలుతూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.నరేష్(Naresh) పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.

అయితే తాజాగా నటుడు ఆశిష్ విద్యార్థి సైతం 60 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకున్న ఘటన వెలుగులోకి రావడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Telugu Surekhavani, Surekha Vani, Surekhs Vani, Suresh Teja, Tollywood-Movie

ఈ క్రమంలోనే రెండో పెళ్లి (Second Marriage) గురించి సురేఖ వాణి (Surekhs Vani) సంచలన వ్యాఖ్యలు చేస్తూ చేస్తున్నటువంటి ఒక రీల్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈమె తాజాగా ఒక రీల్ చేస్తూ.

ముసలోళ్లకి, ముతకోల్లకి పెళ్లిళ్లు అవుతున్నాయి.నాకు ఎందుకు అవ్వడం లేదురా అంటూ సాగే ఫన్నీ రీల్‌ను ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు.

Telugu Surekhavani, Surekha Vani, Surekhs Vani, Suresh Teja, Tollywood-Movie

ఇలా ముసలోళ్ళకి రెండో పెళ్లి అవుతుంది కానీ నాకెందుకు కావడం లేదు అంటూ ఈమె చేసిన ఈ రీల్ కనుక చూస్తుంటే సురేఖ వాణి కూడా రెండో పెళ్లి చేసుకోవాలని ఆలోచనలు ఉందా రెండో పెళ్లి కోసమే ఈమె ఎదురుచూస్తుందా అన్న అర్థం వస్తుందని పలువురు ఈ రీల్ పై కామెంట్లు చేస్తున్నారు.అయితే సురేఖ వాణి సురేష్ తేజ(Suresh Teja) అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది.అయితే 2019వ సంవత్సరంలో సురేష్ తేజ అకాల మరణం పొందడంతో అప్పటినుంచి సురేఖవాణి ఒంటరిగా తన కూతురితో కలిసి ఉంటున్నారు.

అయితే ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ పలు సందర్భాలలో వార్తలు వచ్చాయి కానీ మొదటిసారి ఈమె నాకెందుకు పెళ్లి కావడం లేదు పెళ్లి అంటూ కామెంట్ చేయడంతో ఈమె కూడా రేపో మాపో రెండో పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇవ్వబోతున్నారనే తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube