సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోయిన్లు సినిమాలు చేస్తూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుంటే.ఇక సినిమాలకు దూరమైన హీరోయిన్ లు మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు.
ఇప్పటికే చాలామంది హీరోయిన్లు సరైన హిట్ లేకపోవడంతో సినిమాలకు దూరమయ్యారు.సినిమాల పరంగా అంత సంపాదించకోనప్పటికీ కూడా పెళ్లి చేసుకున్న వారి వల్ల మంచి గౌరవంగా బతుకుతున్నారు.
ఇక తాజాగా మరో హీరోయిన్ కూడా ఇండియన్ బిలినియర్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిసింది.ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఇజం సినిమా తెలుగు ప్రేక్షకులకు కొంతవరకు గుర్తు ఉండవచ్చు అని చెప్పవచ్చు.ఇక ఈ సినిమా కొంతవరకు టాక్ సొంతం చేసుకుంది.
అయితే ఇందులో హీరోయిన్ గా అదితి ఆర్య( Aditi Arya ) నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ ముద్దుగుమ్మనే త్వరలో పెళ్లికూతురు కానుంది.
అదితి తెలుగు తో పాటు హిందీ, తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.
ఇక ఈ బ్యూటీ కెరీర్ మొదట్లో మోడల్ గా చేయగా ఆ తర్వాత నటన మీద ఆసక్తి ఏర్పడటంతో ఇండస్ట్రీకి హీరోయిన్( Heroine ) గా అడుగు పెట్టింది.
ఇక సినిమాల తో పాటు పలు వెబ్ సిరీస్( Web series ) లలో కూడా చేసింది.కానీ అంత గుర్తింపు ఉన్న హీరోయిన్ గా మాత్రం పేరు సంపాదించుకోలేకపోయింది.
ఇక చివరిగా 2021లో బాలీవుడ్ సినిమాలో నటించి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

ఈ బ్యూటీ సినిమాలను వదిలేసిన తర్వాత తన చదువుపై శ్రద్ధ పెట్టినట్లు తెలిసింది.అయితే తాజాగా గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నట్లు తెలిసింది.యేల్ యూనివర్సిటీలో అదితి తన ఎంబీఏ పూర్తి చేసినట్లు తెలిసింది.
ఇక ఈ విషయాన్ని కొటక్ మహేంద్ర బ్యాంక్ ( Kotak Mahendra Bank )వారసుడు తెలిపాడు.కోటక్ మహేంద్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయ్ కోటక్ కుమారుడు జే కోటక్ తన ట్విట్టర్ వేదికగా.
అదితికి సంబంధించిన ఫోటోలు పంచుకొని.

తనకు కాబోయే భార్య అదితి.ఈరోజు యేల్ యూనివర్సిటీలో తన ఎంబీఏ పూర్తి చేసిందని.తనను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ పంచుకున్నాడు.
దీంతో అదితి అతడిని పెళ్లి చేసుకోనుందని క్లారిటీ వచ్చేసింది.గతంలో వీరిద్దరూ దిగిన ఫోటోలు కూడా వైరల్ అవ్వడంతో అప్పట్లో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని బాగా వార్తలు వచ్చాయి.
ఇక ఈ రోజుతో అది నిజం అని తేలింది.







