గత శుక్రవారం ఆర్బీఐ( RBI ) రూ.2000 నోట్లను( Rs.2000 Notes ) ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోట్లు బ్యాంకుల్లో మార్చుకోవచ్చని గడువు ప్రకటించగా చాలా మంది తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను బయటకు తీసి ఖర్చు పెట్టే పనిలో పడ్డారు.రూ.2000 నోట్లను షాపుల్లో తీసుకోమని ప్రభుత్వం చెప్పినప్పటికీ చాలామంది వాటిని స్వీకరించడం లేదు.కొంత మంది మాత్రం తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఈ అవకాశాన్ని బాగా వాడుకుంటున్నారు.
ఈ క్రమంలో ఢిల్లీలోని జీటీబీ నగర్‌కు( GTB nagar in Delhi ) చెందిన ఓ వ్యాపారవేత్త రూ.2000 నోటుకు సంబంధించి ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు.రూ.2000 నోటుతో కొనుగోలు చేస్తే రూ.2100 విలువైన వస్తువులు ఇస్తునట్లు దుకాణం ముందు బోర్డు పెట్టడంతో స్థానికులు ఆ షాపుకి క్యూ కట్టారు.ఇంకా ఈ ఆఫర్‌కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఆఫర్‌పై వ్యాఖ్యానిస్తూ, చాలా మంది వినియోగదారులు RBI తనను తాను తెలివైందిగా భావిస్తే, ఢిల్లీ ప్రజలు అంతకంటే తెలివైనవారని కామెంట్ చేస్తున్నారు.

ఇకపోతే చాలామంది జనులు తమ దగ్గరున్న నోట్లను పెట్రోల్ బ్యాంకుల వద్ద మార్చుకున్నట్టు తెలుస్తోంది.ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం, చాలా మంది పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారని.ఎక్కువగా రూ.2000 నోట్లను దానికోసం తీసుకొస్తున్నారని పెట్రోల్ బంక్ నిర్వహకులు చెబుతున్నారు.రూ.2000 నోట్లపై క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌లపై ఎక్కువ చెల్లింపులు జరుగుతున్నాయని జోమాటో తాజాగా తెలిపిన సంగతి విదితమే.మరోవైపు చాలా ఆలయాలకు 2000 రూపాయల నోట్లు వస్తున్నట్టు భోగట్టా.







