సెట్స్ లోకి మందు తాగేసి వచ్చినందుకు అల్లు రామలింగయ్య ని విజయ నిర్మల గెంటేసిందా..!

బాలనటిగా ఇండస్ట్రీ లో రాణించి ఆ తర్వాత హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి అతి తక్కువ సమయం లోనే స్టార్ గా ఎదిగిన నటి విజయ నిర్మల( Vijaya Nirmala ).ఈమె కేవలం నటి మాత్రమే కాదు, ఒక గొప్ప దర్శకురాలు కూడా, ప్రతీ తెలుగోడు గర్వించదగ్గే ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆమె దర్శకత్వం వహించింది.

 Vijaya Nirmala Interesting Comments About Allu Ramalingaiah,vijaya Nirmala,allu-TeluguStop.com

ఇలా నటిగా గొప్పగా రాణించి దర్శకురాలిగా కూడా ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగిన స్త్రీ బహుశా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎక్కడా లేరనే చెప్పాలి.మహానటి సావిత్రి కూడా ఒక సినిమాకి దర్శకత్వం వహించింది కానీ, విజయ నిర్మల లాగ రెగ్యులర్ దర్శకురాలిగా మాత్రం కొనసాగలేదు.

అప్పట్లో ఈమె ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించేది.అలా సినిమాల ద్వారా ఏర్పడిన వీళ్లిద్దరి పరిచయం ప్రేమగా మారి , కొన్నాళ్ల తర్వాత ఆమె ఆయనని పెళ్లి కూడా చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

Telugu Prodcuer, Savitri, Krishna, Tollywood, Vijaya Nirmala-Movie

సుమారుగా 200 సినిమాల్లో హీరోయిన్ గా నటించిన విజయ నిర్మల , 44 సినిమాలకు దర్శకత్వం వహించింది.అలాంటి దిగ్గజ నటి 2019 వ సంవత్సరం లో గుండెపోటు తో మరణించడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.ఆమె చనిపోయిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) ఎంతో మనోవేదనకు గురి అయ్యాడు.ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉండే కృష్ణ ఆమె చనిపోయినప్పుడు వెక్కి వెక్కి ఏడవడం చూసి అభిమానులు కన్నీరు మున్నీరు అయ్యారు.

ఇదంతా పక్కన పెడితే విజయ నిర్మల గారు గతం లో సూపర్ స్టార్ కృష్ణ తో కలిసి ఎన్నో స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇచ్చింది.ఈ ఇంటర్వ్యూస్ లో యాంకర్స్ అడిగిన ప్రశ్నలకు ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానం చెప్పేది.

అయితే ఒకసారి ఇండస్ట్రీ లో కొంతమంది నటుల వల్ల ఆమెకి ఏర్పడిన ఇబ్బందుల గురించి చెప్తూ అప్పట్లో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేసింది.

Telugu Prodcuer, Savitri, Krishna, Tollywood, Vijaya Nirmala-Movie

ఇక అసలు విషయానికి వస్తే మీరు దర్శకత్వం వహిస్తున్న రోజుల్లో ఏ నటీనటుల వల్ల అయినా ఇబ్బంది పడి షూటింగ్ ని క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయా అని అడగగా, దానికి విజయ నిర్మల గారు సమాధానం చెప్తూ ‘పెద్దగా ఏమి అవ్వలేదు కానీ, కోటశ్రీనివాస రావు గారి ఒకసారి ఇబ్బంది అయ్యింది, ఆ తర్వాత అల్లు రామలింగయ్య( Allu Ramalingaiah ) గారి వల్ల కూడా ఒక ఇబ్బంది ఏర్పడింది.ఒక రోజు ఆయన షూటింగ్ కి బాగా తాగేసి వచ్చాడు.నేను సీన్ పేపర్స్ అందించి సన్నివేశాలను వివరిస్తుంటే ఆయన నవ్వుతూ ఉన్నాడు, తాగిన మైకం లో ఆయనకీ ఏమి అర్థం కావడం లేదు.

అప్పుడు నాకు కోపం వచ్చి వెళ్లిపోండి రామలింగయ్య గారు, ఈరోజు నేను మీతో సీన్ చెయ్యను అని షూటింగ్ స్పాట్ నుండి పంపేసాను.మరుసటి రోజు మళ్ళీ ఆయన లొకేషన్ కి వచ్చిన తర్వాత ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకూడదు అని చెప్పాను, అప్పటి నుండి ఆయన నా సినిమా షూటింగ్ లో ఎప్పుడూ కూడా తాగేసి రాలేదు’ అంటూ చెప్పుకొచ్చింది విజయ నిర్మల.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube