పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అండ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీపై ఆడియెన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇక ఈ సినిమా నుండి మొన్న మేకర్స్ టైటిల్ అండ్ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసిన విషయం తెలిసిందే.”బ్రో” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు మోషన్ పోస్టర్ ద్వారా తెలిపారు.ఈ మోషన్ పోస్టర్ కు యునానిమస్ రెస్పాన్స్ లభించింది.
వినోదయ సీతం( Vinodya Seetham ) అనే తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.అయితే ఇది రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగాయి.
తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు.తమిళ్ లో నటించి తెరకెక్కించిన సముద్రఖని ఇక్కడ కూడా తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ కూడా స్టార్ట్ అయ్యింది.

మొత్తంగా ఈ సినిమా 100 కోట్ల బిజినెస్ అయితే చేసినట్టు సమాచారం.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరో మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.సాయి తేజ్ ఫస్ట్ లుక్ ను ఈ రోజు రివీల్ చేసారు.
ఇక ఈ సినిమాలో సాయి తేజ్ మార్కండేయుడు( Markandeya ) (మార్క్ ) పాత్రలో నటిస్తున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు.ఈ మోషన్ పోస్టర్ లో సాయి తేజ్ వైట్ వైట్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ లో కనిపిస్తున్నాడు.
ఈ పోస్టర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.

కాగా ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన షూట్ ను పూర్తి చేసాడు.దాదాపు 80 శాతం వరకు షూట్ పూర్తి కాగా మిగిలిన షూటింగ్ ను కూడా శరవేగంగా గ్యాప్ లేకుండా పూర్తి చేస్తున్నారు.ఇక పీపుల్స్ మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు కూడా నటిస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.







