కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని స్థాపించిన సంగతి విధితమే.అయితే కాంగ్రెస్ గెలిచిన రోజు మొదలుకొని ఇప్పటివరకు కూడా ఆ పార్టీ గెలుపుకు దారి తీసిన అంశాలపై ఇప్పటివరకు ఒకటే చర్చ.
కాంగ్రెస్ గెలుపుకు బీజేపీ( BJP ) వైఫల్యమే కారణం అని కొందరు అంటుంటే.మరికొండరేమో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాలు అని చెబుతున్నారు.
ఇంకొందరెమో ఆ పార్టీ ప్రకటించ్నా మేనిఫెస్టోనే విన్నింగ్ కు ప్రధాన కారణం అని చెప్పే వారు కూడా లేకపోలేదు.అయితే ఈ వాదనలన్నిటిలోనూ నిజం లేకపోలేదు.

కాగా అన్నిటికంటే ముఖ్యం కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోనే ప్రజల దృష్టిని ఎంతగానో ఆకర్షించిందని చెప్పక తప్పదు.నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం, మహిళలకు ఉచిత బస్సు రవాణా, ఇలా అన్నో అంశాలను మేనిఫెస్టోలో ప్రకటించి ఒక్కసారిగా ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకొని అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ.అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో ఆ పార్టీది కాదా ? అందులోని హామీలన్నీ కాపీ కొట్టిందా ? అంటే అవుననే సమాధానం ఆమ్ ఆద్మీ పార్టీ వినిపిస్తోంది.తమ మనిఫెస్టోలోని అంశాలను కాపీ కొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) తాజాగా వ్యాఖ్యానించారు.

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీ హోదా దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కర్నాటకలో కూడా పోటీ చేసిన సంగతి విధితమే.కానీ అక్కడ కాంగ్రెస్, బీజేపీ, జెడిఎస్( Congress, BJP, JDS ) పార్టీల ప్రభావం అధికంగా ఉండడంతో ఆప్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.అయితే ఎన్నికల ముందు అన్నీ పార్టీల కంటే ముందే మేనిఫెస్టో ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించింది ఆమ్ ఆద్మీ పార్టీ( Aam Aadmi Party ).ఆప్ ప్రకటించిన హామీలు అప్పుడు చర్చనీయాంశం అయ్యాయి కూడా.బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం, ప్రతి కుటుంబానికి 10 కిలోల ఉచిత బియ్యం, అలాగే ఉచిత విద్యుత్ ఇవ్వని కూడా ఆప్ మేనిఫెస్టోలోని అంశాలే.
అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ హవా గట్టిగా ఉండడంతో ఆ పార్టీ మేనిఫెస్టో కాపీ అనే సంగతిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.కానీ ప్రస్తుతం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ కాపీ మేనిఫెస్టో అని నిక్కి చెబుతున్నారు.
మరి దీనిపై హస్తం నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.







