టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్( Ram vharan, Jr NTR ) మధ్య మంచి స్నేహ బంధం ఉందనే సంగతి తెలిసిందే.ఈ ఇద్దరు హీరోలు ఆర్ఆర్ఆర్( RRR movie ) సినిమాలో కలిసి నటించడంతో ఈ హీరోల మధ్య స్నేహం మరింత బలపడింది.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ముందు, రిలీజ్ తర్వాత ఎన్టీఆర్, చరణ్ కలిసి ప్రమోషన్స్ లో కనిపించడం జరిగింది.అయితే ఎన్టీఆర్, చరణ్ మధ్య గత కొంతకాలంగా దూరం కొనసాగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆస్కార్( Ascar ) వేడుకల సమయంలో కూడా ఎన్టీఆర్, చరణ్ ఎవరికి వారే అనే విధంగా వ్యవహరించడం జరిగింది.ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలకు చరణ్ హాజరయ్యేవారు.అయితే ఈ సంవత్సరం మాత్రం తారక్ పుట్టినరోజు( NTR Birthday ) వేడుకల్లో చరణ్ సందడి చేయలేదని సమాచారం.సోషల్ మీడియా ద్వారా చరణ్ తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినా ఫార్మల్ గా చెప్పారు తప్ప ఇద్దరి మధ్య గతంలో ఉన్నస్థాయిలో అనుబంధం అయితే లేదు.

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు చరణ్ హాజరు కాగా ఎన్టీఆర్ మాత్రం హాజరు కాలేదు.అయితే తారక్ చరణ్ మధ్య చిన్నచిన్న మనస్పర్ధలు ఉన్నా వాళ్లిద్దరూ మళ్లీ కలవడం గ్యారంటీ అని మరిన్ని సినిమాలు చేయడం గ్యారంటీ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.తారక్ తర్వాత పుట్టినరోజు వేడుకల్లో చరణ్ సందడి చేస్తారని ఆ సమయానికి మనస్పర్ధలు తొలగిపోతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.చిన్న చిన్న మనస్పర్ధల వల్లే చరణ్ తారక్ పుట్టినరోజు వేడుకలకు హాజరు కాలేదని తెలుస్తోంది.
ఆర్.ఆర్.ఆర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కితే మాత్రం ఈ కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ కు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది.
ఈ ఇద్దరు హీరోల రెమ్యునరేషన్ వేర్వేరుగా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది.







