ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే చిలికి చిలికి గాలి వానగా మారుతుంటాయి.అలాంటి ఒక సంఘటన నటి నిర్మల ( Actress Nirmala )మరియు హీరో కృష్ణ( Krishna ) మధ్య జరిగింది.
అదేంటి వీరిద్దరికీ మధ్య గొడవ రావడం ఏంటి ? నిర్మలమ్మ ఒక నటి, కృష్ణ గారు ఏమో సూపర్ స్టార్.వీరి మధ్య గొడవ రావడానికి ఎక్కడ ఆస్కారం ఉంది అని అనుకుంటున్నారు కదా ? అయితే విషయంలోకి వెళ్దాం.నిర్మలమ్మ కేవలం నటిగానే కాదు ఆమె మాటల రచయితగా కూడా పనిచేశారు.హీరో కృష్ణ నటించిన సింహాసనం( Simhasanam ) సినిమాకి పూర్తిస్థాయిలో ఆమె మాటలను అందించారు.
ఈ విషయం చాలా మంది నమ్మరు కానీ అది నిజం.ఆమె ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలకు మాటల రచయితగా పనిచేసినప్పటికీ ఎక్కడా పేరు వేసుకోవడానికి మాత్రం ఇష్టపడేవారు కాదు.
నటి నిర్మలమ్మకు ఇండస్ట్రీలో అందరితో మంచి సంబంధాలు ఉండేవి. ఆమెకు స్వతహాగా పిల్లలు లేకపోయినా ఇండస్ట్రీలోని చాలామందిని తన సొంత పిల్లల్లా చూసుకునేవారు.అందుకే ఆమె చాలామందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు కూడా.అయితే నిర్మలమ్మ చేతి వంట తిన్నవారెవరు కూడా ఆమెను జీవితంలో మర్చిపోరు.అంత గొప్పగా వంట చేయగలరు.కృష్ణ గారైతే ఆయన ప్రతి సినిమాలోను ఆవిడను ఏదో ఒక పాత్రలో ఉండేలా చూసుకుంటారు.
ఎందుకంటే ఆమె చేసే వంట తినాలి కాబట్టి.అంతే కాదు చాలాసార్లు నా ఇంట్లోనే ఉండిపో .నాకు వంట చేసి పెట్టొచ్చు కదా అంటూ నవ్వుతూ చెప్పేవారట.
ఇక ఒకానొక సందర్భంలో కృష్ణ గారి నిర్మాణంలో జరుగుతున్న ఒక సినిమాకి నిర్మలమ్మ మధ్యాహ్నం పూట చాలా రుచిగా కూరలు వండుకొని వచ్చారట.ముఖ్యంగా వంకాయ కూర అద్భుతంగా ఉందట.అది తిన్నాక చాలామంది సినిమా యూనిట్ భుక్తాయాంశం తో కాసేపు విశ్రాంతి తీసుకుంటామని కునుకు తీసారట.
షూటింగ్ కి లేట్ అవుతున్న ఎవ్వరు రాకపోవడంతో కోపం వచ్చి నిర్మలమ్మ పై అరిచారట కృష్ణ.ఇంకెప్పుడూ నువ్వు షూటింగ్ కి వంటలు చేసుకుని రావద్దు అంటూ హుకుం జారీ చేశారట.
దాంతో కాస్త బాధపడ్డ నిర్మలమ్మ చాలా ఏళ్ల పాటు సెట్టుకి భోజనం తీసుకొచ్చేవారు కాదట.ఇక ఎస్వీ కృష్ణారెడ్డి( SV Krishna Reddy ) కూడా ఆమె వంట అంటే ఎంతో ఇష్టపడేవారు.
ముఖ్యంగా వంకాయ కూర విషయంలో అయితే మరీను.