ఆర్ఎస్ఎస్ అనుబంధ ముస్లిం సంస్థ నినాదం ఇదే... ఒకే దేశం, ఒకే జెండా, ఒకే జాతీయ గీతం!

ఆర్ఎస్ఎస్( RSS ) అనుబంధ ముస్లిం సంస్థ అయినటువంటి ఎంఆర్ఎం (రాష్ట్రీయ మంచ్) ‘ఒకే దేశం, ఒకే జెండా, ఒకే జాతీయ గీతం’ ధీమ్‌ ధ్యేయంగా మైనార్టీ వర్గాలకు చేరువ కావడానికి 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశవ్యాప్త ప్రచారాన్ని షురూ చేయనుంది.ఈ ప్రచారంలో ‘నిజమైన ముస్లిం.

 This Is The Motto Of The Muslim Affiliate Of The Rss One Country , One Flag, One-TeluguStop.com

మంచి పౌరుడు’ అనే సందేశాన్ని వాలంటీర్లు ప్రచారం చేస్తారని ఎంఆర్ఎం ఒక ప్రకటనలో తెలపడం గమనార్హం.ఈ విషయమై జూన్ 8 నుంచి 11వ తేదీ వరకు భోపాల్‌లో ఎంఆర్ఎం వాలంటీర్లు, కార్యకర్తలకు 3 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంఆర్ఎం ప్రధాన పరిపాలకుడు అయినటువంటి ఇంద్రేష్ కుమార్( Indresh Kumar ) ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరు కానున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇకపోతే 2021లో ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాదల్( Ghaziabadal ) జిల్లాలో ఇలాంటి శిక్షణ కార్యక్రమం ఒకదానిని నిర్వహించడం జరిగింది.అయితే అప్పట్లో దానికి అంతగా ఆదరణ లభించలేదని చెప్పుకోవాలి.దాంతో మరలా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు అనగా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహించడం కోసం సన్నాహాలు చేయడం కొసమెరుపు.

ఇక ఈ నేపథ్యంలో ఎంఆర్ఎం ప్రతినిధి షాహిద్ సయీద్( Shahid Saeed ) మాట్లాడుతూ.“2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎంఆర్ఎం ‘ఒక దేశం, ఒక జెండా, ఒక జాతీయ గీతం, ఒకే చట్టం’ అనే ఆలోచనను ముస్లిం సమాజంలోకి బాగా లోతుగా తీసుకెళ్లడానికి ప్రచారం ప్రారంభిస్తుంది.నిజమైన ముస్లిం.మంచి పౌరుడు అనే సందేశాన్ని అందిస్తూ ఎంఆర్ఎం వాలంటీర్లు, కార్యకర్తలు దేశంలోని నలుమూలల ఉన్న మైనారిటీ కమ్యూనిటీకి చేరువవుతారు.” అని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube