ఆదిపురుష్ పబ్లిసిటీ కోసం ప్రభాస్ ప్లాన్స్ ఏంటంటే..!

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ ( Adipurush )విడుదల తేదీ దగ్గర పడుతుంది.ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు.

 Prabhas Adipurush Movie Interesting Update ,prabhas , Adipurush, Bollywood , Om-TeluguStop.com

ప్రభాస్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టడం లేదు.వేరే సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రభాస్ ఆదిపురుష్‌ ప్రమోషన్ కార్యక్రమాలకు ఇప్పుడు డేట్స్ ఇస్తాడు అంటూ అంతా ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

ఒక భాష.రెండు భాషల్లో విడుదల అయ్యే సినిమా కాదు, పాన్ వరల్డ్ గా విడుదల అవ్వబోతున్న సినిమాకు ఇప్పటి వరకు ప్రమోషన్ కార్యక్రమాలకు ప్రభాస్‌ హాజరు కాక పోవడం పట్ల ఆ చిత్ర యూనిట్ సభ్యులతో పాటు అభిమానులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Telugu Adipurush, Bollywood, Kriti Sanon, Om Raut, Prabhas, Telugu-Movie

వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆదిపురుష్‌ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయితే బాగుండేది.రాజమౌళి తన సినిమాల పబ్లిసిటీని రెండు నెలల నుండి నిర్వహిస్తూ ఉంటారు.అదే తరహాలో ప్రభాస్ చిత్ర యూనిట్ సభ్యులు కూడా రెండు నెలల ముందు నుండే మొదలు పెట్టి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Adipurush, Bollywood, Kriti Sanon, Om Raut, Prabhas, Telugu-Movie

ఇది కేవలం హిందీ, తెలుగులో విడుదల అయ్యే సినిమా కాదు.కనుక పబ్లిసిటీ అనేది దేశ వ్యాప్తంగా మారు మోగాల్సిన అవసరం ఉంది.ఒకవేళ పబ్లిసిటీ విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చూపించినా కూడా కచ్చితంగా సినిమా పై ప్రభావం ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రామాయణ ఇతి వృత్తంతో రూపొందింది.రాముడిగా ప్రభాస్( Prabhas ) ని ప్రేక్షకులు చూడబోతున్నారు.సీత పాత్రలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్‌ ( Kriti Sanon )కనిపించబోతోంది.బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసుర పాత్రలో కనిపించబోతున్నాడు.

మొత్తానికి ఈ సినిమా భారీ స్టార్ కాస్టింగ్ తో రూపొందింది.అంతే కాకుండా రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.ఇటీవల విడుదలైన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక మోస్తరు టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ విషయంలో రికార్డులు సృష్టించబోతున్న ఆదిపురుష్‌ కి ప్రమోషన్ కార్యక్రమాలు కచ్చితంగా భారీగా చేయాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube