తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఏదో చెప్తున్నారే ?

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో టిడిపికి ఆదరణ కరువైంది.ఇక పార్టీకి చెందిన కీలక నేతలంతా వరుసగా ఇతర పార్టీలోకి చేరిపోయి, కీలకమైన స్థానాలను దక్కించుకున్నారు.

 Telangana Tdp President Is Saying Something , Telangana Tdp, Bakkani Narasimhulu-TeluguStop.com

కీలక నాయకులంతా తమ దారి తాము చూసుకోవడంతో మిగిలిన నాయకులు, ఇతర పార్టీల్లో చేరే అవకాశం లేక, చేరడం ఇష్టం లేక సైలెంట్ గానే ఉండిపోయారు.ఇప్పటికే ఎల్ రమణ తర్వాత బక్కాని నరసింహులను( Bakkani Narasimhulu ) టిడిపి అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించారు.

ఆయన పనితీరు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడంతో, ముదిరాజ్ సామాజిక వర్గంలో గట్టి పట్టున్న నేత, ఆర్థిక స్థితి మంతుడైన కాసాని జ్ఞానేశ్వర్ కు తెలంగాణ టిడిపి అధ్యక్ష బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు.

Telugu Bakkani Simhulu, Chandrababu, Congress, Kasanijaneswar, Ramana, Telangana

ఇక అప్పటి నుంచి ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు కాసాని జ్ఞానేశ్వర్.గతంతో పోలిస్తే పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు.రాబోయే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని అయినా సరే, కొన్ని స్థానాలైనా పోటీ చేసి టిడిపి అభ్యర్థులను ( TDP )గెలిపించుకోవాలనే పట్టుదలతో జ్ఞానేశ్వర్ ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఆయన పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిన నాయకులకు పిలుపునిచ్చారు టిడిపిని వీడిని వారంతా తిరిగి పార్టీలోకి రావాలని, పార్టీని బలోపేతం చేసుకుందామని జ్ఞానేశ్వర్ కోరుతున్నారు.నిన్ననే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, హుస్నాబాద్, కరీంనగర్, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాలకు టిడిపి ఇన్చార్జీలను నియమించారు.

Telugu Bakkani Simhulu, Chandrababu, Congress, Kasanijaneswar, Ramana, Telangana

కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జిగా గంగాధర కనకయ్య, సిరిసిల్ల ఇన్చార్జిగా ఆకునూరి దయాకర్ రావు, చొప్పదండి ఇన్చార్జిగా జంగం అంజయ్య, హుస్నాబాద్ ఇన్చార్జిగా బత్తుల శ్రీనివాసులను నియమించారు.పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్( Kasani Gnaneshwar Mudira ) పిలుపునిచ్చారు.పనిచేసే వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, ప్రజల్లో టిడిపి పై అభిమానం ఉందని , పార్టీని ప్రజల ముందుకు తీసుకు వెళ్తే వారే ఆదరిస్తారని, అంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లి, తెలంగాణలో టిడిపిని అధికారంలోకి తీసుకు వద్దామని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube