చుండ్రు సమస్యతో( dandruff ) బాధపడుతున్నారా? జుట్టు రోజురోజుకు పల్చబడుతోందా? అయితే ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టే రెమెడీ ఒకటి ఉంది.నెలకు కేవలం రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు దెబ్బకు పరార్ అవ్వడమే కాదు.
జుట్టు ఒత్తుగా, పొడుగ్గా కూడా పెరుగుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక అలోవెరా ఆకు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అలోవెరా ముక్కలు వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి( Curry leaf powder ), వన్ టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి( amaranth powder ), వన్ టేబుల్ స్పూన్ శీకాకై పొడి, రెండు తుంచిన మందారం ఆకులు, అర కప్పు పెరుగు వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె( coconut oil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా తలస్నానం చేయాలి.
నెలకు కేవలం రెండు సార్లు ఇలా చేస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే క్రమంగా మాయం అవుతుంది.అలాగే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.దాంతో జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.
పైగా ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు.అయితే ఈ రెమెడీని పాటిస్తే జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది.
వయసు పైబడిన కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి.కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.