జగన్ నయా స్కెచ్ పొత్తుని ఎదుర్కోగలదా?

తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయి ఎన్నికలవేడి కనబడుతుంది .పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికలు జరగటం ,ఫలితాలు వెలువడటం, అక్కడ పార్టీలు అనుసరించిన వ్యూహాలపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో.

 Jagan Naya Sketch To Face Tdp And Janasena , Chandrababu, Lokesh, Pawan Kalyan,-TeluguStop.com

ఆ వేడి ఇప్పుడు ఇక్కడకి కూడా పాకినట్లు కనబడుతుంది.అక్కడ పార్టీలు అనుసరించిన వ్యూహాలపై ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్లో జనసేన- తెలుగుదేశం( Janasena- Telugu Desam ) కూటమి కచ్చితంగా ఏర్పడుతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ సింగిల్గానే పోటీపడుతుందని దాదాపు కన్ఫామ్ అయిపోయిన నేపథ్యంలో ఆ రెండు పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలపై పై ఇప్పుడు విశ్లేషణలు వస్తున్నాయి.

Telugu Andhra Pradesh, Chandrababu, Jagan, Jagannaya, Janasena, Lokesh, Pawan Ka

సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )లో ఎన్నికలు సామాజిక వర్గాల సమీకరణలతో నడుస్తూ ఉంటాయి.అయితే జనసేన-తెలుగుదేశం పొత్తుతో ఒక బలమైన సామాజిక సమీకరణం ఏర్పడినందున సాధారణ వ్యూహాలతో వారిని ఓడించడం సాధ్యం కాదని భావిస్తున్న వైసిపి అధిష్టానం కొత్త ఈక్వేషన్స్ దిశగా దృష్టి సారించిందని తెలుస్తుంది .ఆ పార్టీ ఇటీవల ఇస్తున్న స్టేట్మెంట్లు,ఆ పార్టీ అధినేత జగన్( jagan ) చేస్తున్న వ్యాఖ్యలను నిశితం గా పరిశీలిస్తే వచ్చే ఎన్నికలను పేదలకు మరియు పెద్దలకు మధ్య పోటీ గా మార్చబోతున్నట్లుగా అర్థమవుతుంది.ఆ పార్టీ సోషల్ మీడియాలో ఇటీవల వెలువరించిన ఒక పోస్టును ఉదాహరణగా తీసుకుంటే పేదలందర్నీ కాపాడడానికి అవతరించిన ఒక దేవుడు లాగా జగన్ ను ప్రెసెంట్ చేశారు .జగన్తో యుద్ధం చేస్తున్న ప్రత్యర్థులుగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్( Chandrababu, Lokesh, Pawan Kalyan ) చిత్రీకరించారు.తద్వారా సంక్షేమ పథకాలతో ప్రజలకు న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి అన్న సంకేతాలను ఇవ్వడానికే ఆ పార్టీ బలంగా ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థమవుతుంది.

Telugu Andhra Pradesh, Chandrababu, Jagan, Jagannaya, Janasena, Lokesh, Pawan Ka

ఆ రెండు పార్టీలు కలిస్తే బలమైన సామాజిక వర్గాల ఈక్వేషన్ ఏర్పాటు అవుతుందని దానిని మించిన ఈక్వేషన్లను తీసుకొస్తే తప్ప విజయం కష్టమని భావిస్తున్న వైసీపీ అధిష్టానం ఆర్థిక తారతమ్యాలను లెక్కలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది.నూటికి 90 శాతం మంది పేదలు మధ్యతరగతి వారే ఉంటారు కాబట్టి తమ సంక్షేమ పథకాల లబ్ధిదారులైన వారిని చివరి వరకు నిలబెట్టుకుంటే ఎలాంటి ఈక్వేషన్ ని అయినా ఎదుర్కోవచ్చని అధికార పార్టీ ఆలోచనగా తెలుస్తుంది.బలహీన వర్గాలు దిగువ మద్య తరగతి వర్గాలు తమ సంక్షేమ పథకాల పట్ల కృతజ్ఞులై ఉంటారని, పరిస్థితులు ఎలా మారినా కూడా కడవరకు వారు తమతో నిలబడతారని ఆ పార్టీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి కొత్త ఈక్వేషన్స్ కి తెర తీసిన జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఈ వ్యూహాలతో గెలవగలరో లేదో మరి కొద్ది రోజుల్లో ఒక క్లారిటీ వస్తుంది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube