సునిశిత్ ను కొట్టిన తర్వాత చరణ్ ఫ్యాన్స్ డబ్బులివ్వడానికి కారణమిదా.. గొప్పోళ్లంటూ?

ఈ మధ్య కాలంలో వేర్వేరు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్న సునిశిత్(Sunishith) ఇష్టానుసారం కామెంట్లు చేస్తూ విమర్శల పాలవుతున్నారు.కొంతమంది నెటిజన్లు ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై(Youtube Channels) కూడా సీరియస్ కావడం జరుగుతోంది.

 Ram Charan Fans Gave Money To Sunishith Details, Ram Charan, Sunishith, Ram Char-TeluguStop.com

సాధారణంగా సెలబ్రిటీల గురించి మాట్లాడే సమయంలో అబద్ధాలు చెప్పడానికి ఎవరూ ఇష్టపడరు.అయితే సునిశిత్ నోటి నుంచి వచ్చే ప్రతి మాట అబద్ధం అనే సంగతి తెలిసిందే.

అయితే ఉపాసన(Upasana), సుస్మిత(Sushmita) గురించి సునిశిత్ తప్పుగా మాట్లాడటంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ అతనిని చితగ్గొట్టిన సంగతి తెలిసిందే.చరణ్ ఫ్యాన్స్ సునిశిత్ పై పోలీస్ కేసు పెట్టాలని కూడా భావించినా అతని కెరీర్ ను నాశనం చేయడం కరెక్ట్ కాదనే ఒకే ఒక్క కారణంతో వెనక్కు తగ్గారు.

అయితే సునిశిత్ ను దారుణంగా కొట్టిన చరణ్ అభిమానులు ఆ తర్వాత అతనికి డబ్బులు ఇవ్వడం గమనార్హం.

సునిశిత్ తప్పు చేసినా అతనిపై చరణ్ ఫ్యాన్స్ జాలి చూపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.చరణ్ ఫ్యాన్స్ సునిశిత్ తో మాట్లాడుతూ ఖర్చులకు ఈ డబ్బులు ఉంచుకోవాలని సూచనలు చేశారు.ఇంకోసారి అలా మాట్లాడవద్దని వ్యక్తిగతంగా ఎవరి జోలికి వెళ్లవద్దని చెప్పుకొచ్చారు.

ఇంట్లో ఆడవాళ్ల గురించి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని చరణ్ ఫ్యాన్స్(Charan Fans) అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆడవాళ్ల గురించి మాట్లాడటం తప్పని చరణ్ అభిమానులు సునిశిత్ కు హిత బోధ చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంతకుముందు ఎవరేం మాట్లాడినా దెబ్బలు పడలేదని ఇప్పుడెందుకు పడ్డాయో ఆలోచించాలని చరణ్ అభిమానులు అభిప్రాయపడ్డారు.

ఇకమీదైనా బుద్ధిగా ఉండాలని సునిశిత్ కు చరణ్ ఫ్యాన్స్ సూచనలు చేశారు.చరణ్ ఫ్యాన్స్ గొప్పోళ్లని నెటిజన్లు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube