టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.ఆయన ఇంటి వద్ద అదనపు బలగాలు భారీగా మోహరించాయి.
శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగానే అదనపు బలగాలను పంపించామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.అయితే అమరావతిలో ఉన్న చంద్రబాబు గెస్ట్ హౌస్ ను రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
లింగమనేనికి చెందిన ఈ ఆస్తిని క్విడ్ ప్రో కో ద్వారా చంద్రబాబు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో క్రిమినల్లా అమెండ్ మెంట్ 1944 చట్టం ప్రకారం గెస్ట్ హౌస్ ను అటాచ్ చేశారు.







