సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఒక్కోసారి జనాలను భయబ్రాంతులకు గురయ్యేలా చేస్తుంటాయి.ఇక్కడ కూడా అదే జరిగింది.
అయితే అదేదో పెద్ద జంతువు ఓ మనిషిని భయపెడితే ఇక్కడ పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.అతి చిన్న జీవి, పైగా సాధు జంతువు అయినటువంటి తాబేలు ఒక మహిళకు సిస్సు పోయించిందంటే మీరు నమ్ముతారా? ఇక్కడ సరిగ్గా అదే జరిగింది.ఓ తాబేలుకి ( Tortoise )సాయం చేయాలనుకున్న మహిళ భంగపడిన ఉదంతాన్ని ఇక్కడ చూడవచ్చు.

సాధారణంగా తాబేళ్లు అనేవి చాలా సైలెంట్ గా ఉంటాయని అనుకుంటారు.ఈ వీడియో చూసిన తరువాత ఆమ్మో! అవి కూడా తిరగబడతాయని మీరు తెలుసుకుంటారు.ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని ఒక్కసారి గమనిస్తే, ఓ మహిళపైకి( woman ) తాబేలు ఎలా దాడి చేసిందో చూడవచ్చు.
కంచెకు అవతల ఉన్న తాబేలుకు ఓ మహిళ కనికరించి మంచినీరు అందించింది.మొదట అది సైలెంట్‌గా మంచినీరు తాగుతూనే ఒక్కసారిగా ఆమెపైకి అటాక్ చేసింది.దాంతో బిత్తరబోయింది.అనవసరంగా దీనికి సాయం చేశాను కదా అని అనుకుంది.

చూసే వారికి గుండె గుభేల్ అనిపించే ఈ వీడియో స్ట్రాంగెస్ట్ మీడియా అనే ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.దాంతో ఈ వీడియో వెలుగు చూసింది.ఈ వీడియోను లక్షల్లో జనాలు ఆదరిస్తున్నారు.ఈ క్రమంలో నెటిజనం రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.‘తాబేలు అలా అటాక్ చేస్తుందని బహుశా ఆమె ఊహించి ఉండదు’ అని కొందరంటుంటే… ‘ఈ కాలంలో మేలు చేసినవారికి కీడు జరుగుతుంది అని ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.







