సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించిన సినిమా మేమ్ ఫేమస్( Mem famous ).ఈ సినిమాను లహరి ఫిలింస్, చాయ్ బిస్కెట్ ఫిలింస్ కలిసి రూపొందించాయి.
ఈ మూవీని అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ సంయుక్తంగా నిర్మించారు.ఇందులో మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమాను గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్( Geeta Arts Film Distribution ) విడుదల చేస్తోంది.
కాగా ఇదే విషయాన్ని తెలుపుతూ తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఛాయ్ బిస్కెట్ ఫిలింస్ ఒక ఫన్నీ వీడియోని షేర్ చేసింది.గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు సుమంత్ ప్రభాస్ ( Sumanth Prabhas )అండ్ టీం.చిన్నపిల్లలు తింటారు లిటిల్ హార్ట్స్.మేమ్ ఫేమస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది గీతా ఆర్ట్స్ అంటూ డప్పుల మోతతో డాన్సులు చేస్తూ రచ్చ రచ్చ చేశారు.
ఈ గోలకి ఆఫీసు గేటు తీసి లోపలికి వచ్చిన అల్లు అరవింద్.రేయ్, నేనెప్పుడు తీసుకున్నానురా? అని ఆశ్చర్యంగా ప్రశ్నించగా.కొత్తోళ్లం సర్.ఛాయ్ బిస్కెట్ సర్ అని సుమంత్ ప్రభాస్ అనగా అల్లు అరవింద్ సంతోషంతో.
26 మే, డన్, అందరూ రండి థియేటర్‌కి అని అల్ ది బెస్ట్ చెప్పారు.దాంతో మళ్ళీ డప్పులు మోతలతో ఫుల్ గా చిందులు వేశారు.కాగా ఇటీవల కాలంలో గీతా ఆర్ట్స్ కేవలం పెద్ద పెద్ద సినిమాలను మాత్రమే కాకుండా చిన్న సినిమాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.మరి ఈ చిన్న సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి మరి.కాగా ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వర్షం పడుతోంది చమ్ చమ్ చమ్… మే 26న మేమ్ ఫేమస్‌కి అందరూ కమ్ కమ్ కమ్ అంటూ హీరో విజయ్ దేవరకొండ చేసిన డేట్ అనౌన్స్‌మెంట్ వీడియో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.