ఐఏఎస్, ఐపీఎస్ లకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.ఈ క్రమంలో ఐఏఎస్ కృష్ణబాబు, ఐపీఎస్ ద్వారకా తిరుమల రావుకు ఉపశమనం లభించింది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణపై కోర్టు ఉత్తర్వులను ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించారని కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించింది.
ఐఏఎస్ కృష్ణబాబు, ఐపీఎస్ ద్వారకా తిరుమలరావుకు సింగిల్ బెంచ్ శిక్ష విధించింది.ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీ లోగా రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని సింగిల్ బెంచ్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
అయితే సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను జూన్ 16వ తేదీకి వాయిదా వేసింది.







