సైబర్ వలలో చిక్కిన ఫిల్మ్ మేకర్.. ఏకంగా రూ.96.57 లక్షలకు కుచ్చుటోపి..!

సైబర్ నేరగాళ్ల దోపిడికి అడ్డు అదుపు లేకుండా పోయింది.ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి అమాయకులను దోచుకోవడమే ఈ సైబర్ కేటుగాళ్ల పని.

 Biggest Online Task Fraud In Pune Ad Filmmaker Loses Rs 96 Lakh Filmmaker , Cyb-TeluguStop.com

తాజాగా ఓ సైబర్ క్రైమ్( Cyber crime ) వెలుగులోకి వచ్చింది.ఓ ఫిల్మ్ మేకర్ పార్ట్ టైం జాబ్ పేరుతో అత్యాశకు పోయి దాదాపుగా కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు.

ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

పూణేలోని బధ్వాన్ ఎన్టీఏ రోడ్డు( Pune ) సమీపంలోని రామ్ బాగ్ కాలనీలో నివాసముంటున్న 56 ఏళ్ల ఫీలింగ్ మేకర్ ( Filmmaker )మొబైల్ ఫోన్ కు పార్ట్ టైం జాబ్ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది.

ఆ మెసేజ్ సైబర్ నేరగాళ్లు పంపించారని విషయం తెలియక.సైబర్ నేరగాళ్ల చాటింగ్ గ్రూప్ లో ఆ మెసేజ్ ద్వారా జాయిన్ అయ్యాడు.

Telugu Cyber, Filmmaker, Task, Time Job, Pune-Latest News - Telugu

ఫిల్మ్ మేకర్ ను నమ్మించడం కోసం వెల్కమ్ బోనస్ పేరిట పదివేల రూపాయలు ఇచ్చారు.తాము ఇచ్చిన టాస్క్ లు పూర్తి చేయడమే పార్ట్ టైం జాబ్ అని నమ్మించి, కొన్ని టాస్క్ లు పంపించారు.అయితే ముందుగా 21,990 రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాతనే టాస్కులు పూర్తి చేయాలని సూచించారు.బాధితుడు ఆ సొమ్మును రెండు విడుతలు గా చెల్లించాడు.సైబర్ నేరగాళ్లు వెంటనే తిరిగి రూ.24,809 చెల్లించడంతో వారిని పూర్తిగా నమ్మేశాడు.

Telugu Cyber, Filmmaker, Task, Time Job, Pune-Latest News - Telugu

తర్వాత ఎనిమిది టాస్కులు పంపిస్తామని, ముందుగా రూ.80,000 డిపాజిట్ చేస్తే, టాస్కులు పూర్తిచేసిన వెంటనే 94,840 వస్తాయని నమ్మించారు.తర్వాత కమిషన్ చెల్లించలేదు కానీ రూ.32.25 లక్షలు చెల్లించాలని నమ్మే విధంగా చెప్పడంతో మొత్తం డబ్బు డిపాజిట్ చేశాడు కానీ కమిషన్ మాత్రం రాలేదు.మరోసారి బాధితుడికి ఫోన్ చేసి పాత కమిషన్లు మొత్తం చెల్లిస్తామని, కొన్ని టాస్క్ లు కూడా పంపిస్తామని నమ్మించడంతో ఏకంగా రూ.61.32 లక్షలు చెల్లించి పోయాడు.ఎవరికి తాను మోసపోయిన విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు బాధితుడి చాటింగ్ యాప్ ద్వారా, బ్యాంకు సమాచారం ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube