ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న టాప్ ఏఐ ఇమేజ్‌ జనరేటర్స్ ఇవే..

ఇమేజ్‌లను రూపొందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది.అయితే దీని వల్ల కాపీరైట్ ప్రొటెక్షన్ విషయంలో ఆందోళనలు తలెత్తాయి.

 These Are The Top Ai Image Generators Trending On Social Media Dall-e 2 Artbreed-TeluguStop.com

సాధారణంగా ఏఐ జనరేటర్లు( AI Generators ) ఇంటర్నెట్ ఇమేజ్ డేటాసెట్‌లపై ట్రైనింగ్ పొందుతాయి.విజువల్ రిప్రజెంటేషన్లను అర్థం చేసుకోవడానికి ప్యాటర్న్స్‌, క్యాప్షన్స్‌ ఉపయోగిస్తాయి.

మానవుల వలె చాలా క్రియేటివ్‌గా ఇమేజెస్ క్రియేట్ చేస్తాయి.ఏఐ ఇప్పటికే ఉన్న ఆర్ట్‌వర్క్ నుంచి నేర్చుకుంటున్నప్పుడు, ఇది ఆర్ట్‌వర్క్ సారాంశాన్ని సంగ్రహిస్తుంది.

DALL-E 2, Artbreeder, Waifu లాబ్స్, డీప్ డ్రీమ్ జనరేటర్ వంటి కొన్ని ప్రముఖ AI ఇమేజ్ జనరేటర్లు కమర్షియల్ యూసేజ్‌కి అనుమతిని అందిస్తాయి.కాకపోతే కొన్ని పరిమితులు వర్తించవచ్చు.

DALL-E 2 అని పిలిచే ఏఐ ఇమేజ్ జనరేటర్‌ను ఓపెన్ఏఐ ( OpenAI ) అభివృద్ధి చేసింది.బింగ్‌తో సహా వివిధ ప్లాట్‌ఫామ్‌లలో విలీనం అయిన ఈ జనరేటర్ వివిధ ఇమేజ్ క్రియేషన్లలో కీలకంగా మారింది.

వినియోగదారులు తాము దేనిని క్రియేట్ చేస్తే దానికి ఓనర్‌షిప్ కలిగి ఉంటారు.అంటే కాపీరైట్ హక్కులన్నీ వారి వద్దే ఉంటాయి.

Telugu Ai, Artbreeder, Dall, Deep Dream, Waifu Labs-Technology Telugu

ఈ ఇమేజ్‌లను క్రియేట్ చేసినవారు సొంత ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు.లేదంటే వాటిని అమ్మేసి డబ్బులు అర్జించవచ్చు.ఆర్ట్‌బ్రీడర్ ( Artbreeder ) అనేది ల్యాండ్‌స్కేప్‌లు, ముఖాలు, పెయింటింగ్‌ల వంటి అద్భుతమైన చిత్రాలను సృష్టించడానికి, సవరించడానికి వినియోగదారులను అనుమతించే ఒక ఇమేజ్ రీమిక్సింగ్ టూల్.ఈ టూల్‌తో యూజర్లు ఇమేజ్‌లు బ్రీడ్ చేయవచ్చు లేదా ఇప్పటికే ఉన్న ఇమేజ్‌లు రీమిక్స్ చేయవచ్చు.

Telugu Ai, Artbreeder, Dall, Deep Dream, Waifu Labs-Technology Telugu

వైఫు ల్యాబ్స్, కస్టమ్ అనిమే పోర్ట్రెయిట్‌లను రూపొందించడానికి ఉపయోగపడే ఒక AI-బేస్డ్ జనరేటర్.ఇది కూడా ఈ రోజుల్లో టాప్ ఏఐ ఇమేజ్‌ జనరేటర్‌గా కొనసాగుతోంది.డీప్ డ్రీమ్ జనరేటర్ మూడు ఇమేజ్ ప్రాసెసింగ్ ఆప్షన్స్‌ అందిస్తుంది.ప్రాంప్ట్‌లను ఇన్‌పుట్ చేయడం, స్టైల్‌లను ఎంచుకోవడం, వారి సొంత ఇమేజ్‌లు అప్‌లోడ్ చేయడం ద్వారా ప్రత్యేకమైన విజువల్స్‌ను రూపొందించడానికి ఈ టూల్ పనికొస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube