హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఓఆర్ఆర్ ను ప్రభుత్వం 30 ఏళ్ల లీజుకు ఇచ్చిందన్నారు.ఓఆర్ఆర్ హైదరాబాద్ కు తలమానికమన్న కిషన్ రెడ్డి దేశంలో హైదరాబాద్ గ్రోత్ చాలా అద్భుతంగా ఉందని తెలిపారు.
ఓఆర్ఆర్ పై ప్రతి ఏటా ఆదాయం పెరుగుతుంది తప్ప ఎన్నడూ తగ్గదని పేర్కొన్నారు.ఓఆర్ఆర్ తో ప్రతి ఏటా రూ.415 కోట్లు ఆదాయం వస్తుందని తెలిపారు.







