టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఓ రేంజ్ లో సందడి చేసిన బ్యూటీ అనసూయ( Anasuya Bharadwaj ).పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా అందంతో అందర్నీ తన వైపుకు మలుపుకుంది ఈ హాట్ బ్యూటీ.
కేవలం యాంకర్ గానే కాకుండా నటిగా కూడా తనలో ఉన్న టాలెంట్ ని బయటపెట్టి మంచి పేరు సంపాదించుకుంది.ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ రేంజ్ లో హడావుడి చేస్తుంది అనసూయ.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె విజయ్ దేవరకొండ ను మరోసారి టార్గెట్ చేస్తూ కనిపించింది.అయితే అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అనసూయకు ఖాళీ సమయం దొరికితే చాలు నెట్టింట్లో అడుగుపెట్టి బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.ముఖ్యంగా తన అందాలను బయట పెడుతూ బాగా మతి పోగోడుతుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎద అందాల నుండి థైస్ అందాల వరకు చూపిస్తూ కన్నార్పకుండా చేస్తుంది.ఈ వయసులో కూడా ఈమె అందాలు ఆరబోయటంతో నెటిజన్స్ ఈమెపై బాగా ఫైర్ అవుతూ ఉంటారు.
కాస్త పద్ధతిగా ఉండొచ్చు కదా అంటూ సలహాలు ఇస్తూ ఉంటారు.

కానీ అనసూయకు అటువంటి సలహాలు ఇవ్వడం నచ్చదు.ఎవరైనా తనకు నెగిటివ్ కామెంట్ చేస్తే చాలు వెంటనే వారిని రఫ్ ఆడిస్తుంది.ఒక్కొక్కసారి లైవ్ లోనే బూతులు తిట్టేస్తుంది.
నెగిటివ్ కామెంట్లు చేసిన వారిని ట్యాగ్ చేసి మరి తన స్టైల్ లో కౌంటర్ వేస్తూ ఉంటుంది.అలా ఈమె వివాదస్పద నటిగా కూడా పేరు సంపాదించుకుంది.
అయితే ఈమె తాజాగా విజయ్ దేవరకొండ ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేసినట్లు కనిపించింది.
గతంలో కూడా విజయ్ దేవరకొండ( Vijay Devarakonda )పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే.‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.కర్మ.
కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా.ఎదుటివారి బాధని చూసి సంతోష పడడం లేదు కానీ ధర్మమే గెలిచింది’ అంటూ అనసూయ గతంలో విజయ్ ను టార్గెట్ చేసి ఈ కామెంట్ చేసింది.

కారణమేంటంటే.ఆయన గతంలో అర్జున్ రెడ్డి సినిమాలో నటించినప్పుడు అమ్మని తిట్టినట్లుగా ఒక బూతు డైలాగ్ ఉండటంతో ఆ సమయంలో అనసూయ నానా రచ్చ చేసింది.దీంతో లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ సమయంలో ఆ కామెంట్ చేసి అందరి దృష్టిలో పడింది అనసూయ.అయితే తాజాగా మరోసారి ఆయనను టార్గెట్ చేసినట్లు కనిపించింది.

ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమాలో( Kushi ) నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేయగా అందులో ది విజయ్ దేవరకొండ అంటూ మెన్షన్ చేశారు.దీంతో అనసూయ ట్విట్టర్ లో ‘అమ్మ బాబోయ్.దీ నా.? ఏం పైత్యం రా బాబు’ అంటూ ట్వీట్ చేసింది.దీంతో ఆమె మరోసారి విజయ్ ను టార్గెట్ చేసినట్లు కనిపించింది.
ఇక వెంటనే విజయ్ అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు.ప్రతిసారి నీ టార్గెట్ ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు
.






