తెలంగాణ మరో కొత్త పార్టీకి వేదిక సిద్ధమైంది .బారాస బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి( Ponguleti Srinivasa Reddy ) కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధమైనట్టుగా వార్తలు వస్తున్నాయి .
అనేక హామీలు ఇచ్చి ఆనక మోసం చేసిన కేసీఆర్( kCR ) బాధితులు చాలా మంది ఉన్నారని అలాంటి వారు అందరికీ ఒక వేదిక కల్పించి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.తనతో పాటు బారాస బహిష్కరించిన మరో నేత జూపల్లి కృష్ణారావును కూడా తనతో కలుపుకొని ఖమ్మం మహబూబ్నగర్ తో పాటు వరంగల్ నల్గొండ లో దాదాపు 45 స్థానాలలో ఆయన పోటీ చేయాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి .తెలంగాణ రైతు సమాఖ్య(టిఆర్ఎస్ ) పేరతో ఆయన అనుచరులు ఇప్పటికే పార్టీని కూడా ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేపించారని కెసిఆర్ కు జలక్ ఇవ్వడానికే టిఆర్ఎస్( TRS ) పేరును వాడుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఈ వార్తలు నిజమైతే గనక అది ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టి కేంద్ర రాజకీయాలను శాసించాలని చూస్తున్న భారతీయ రాష్ట్ర సమితికి ఎదురు దెబ్బ అని చెప్పాలి.
అంతే కాకుండా తెలంగాణ రైతు సమైక్య పేరుతో టిఆర్ఎస్ అని అర్థం వచ్చేలా తమ పార్టీ పేరును లాక్కోవాలని చూస్తున్న పొంగులేటి వైఖరి ని బారసా నిశితం గా నిశ్చితంగాపరిశీలిస్తున్నదట.

అయితే టిఆర్ఎస్ పేరుతో పార్టీ నమోదు చేయడం దానికి కామన్ సింబల్ సంపాదించడం అనుకున్నంత సులువు కాదని ఇంకో ఆరు నెలల లోపే ఎన్నికలు ఉన్నందున కామన్ సింబల్ సంపాదించడం కష్ట మేనని కోదండరాం పార్టీ( Kodandaram party ) గతంలో కూడా ఇలాంటి ప్రయత్నం చేసినప్పటికీ విఫలమైందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.అయితే మరికొంతమంది మాత్రం పొంగిలేటి కొత్త పార్టీ పెట్టడం నిజమైతే అది కేసీఆర్కే అనుకూలంగా మారుతుందని ప్రభుత్వ వ్యతిరేకత చీల్చడం ద్వారా కేసీఆర్ మరొకసారి అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుంది తప్ప అంతకు మించి పొంగులేటి సాధించేది ఏమీ ఉండదని వాఖ్యనిస్తున్నారు మరి పొంగులేటి పార్టీ ఏర్పాట్లలో నిజం ఎంతో మరికొన్ని రోజుల్లో ఒక క్లారిటీ రావచ్చు
.






